నెల్లూరు జిల్లా, 22 సెప్టెంబర్ 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో ఈ నెల 24వ తేదీతో పదవీ కాలం ముగుస్తున్న సందర్భంగా నెల్లూరు జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఆనం అరుణమ్మ ని, వివిధ మండలాల జడ్పీటీసీ సభ్యులను ఘనంగా సన్మానించిన మాజీ మంత్రి వర్యులు ఉమ్మడి నెల్లూరు జిల్లా వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు “డా” కాకాణి గోవర్ధన్ రెడ్డి, ఆనం అరుణమ్మ గారు, రూరల్ ఇంచార్జ్ విజయకుమార్ రెడ్డి, జడ్పిటిసి లతో కలిసి వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన కాకాణి గోవర్ధన్ రెడ్డి. ఆనం అరుణమ్మ నిరంతరం ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేసి, గ్రామీణాభివృద్ధికి ఎంతో కృషి చేశారు. జడ్పీ సమావేశాలను అరుణమ్మ సమర్థవంతంగా నిర్వహించి ప్రజా సమస్యల పరిష్కారంలో కీలక పాత్ర పోషించారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో జడ్పిటిసిలు కీలక పాత్ర పోషించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఆనం అరుణమ్మ, జడ్పీటీసీ సభ్యులు తమ ఐదేళ్ల పాలనా కాలంలో ప్రజలకు ఎనలేని సేవలు అందించారని కొనియాడారు. జిల్లా పరిషత్ చైర్పర్సన్ గా ఆనం అరుణమ్మ నిరంతరం ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేశారు. సభను సమర్థవంతంగా నిర్వహిస్తూ, జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి ఎంతో కృషి చేశారు. ప్రజా సమస్యల పరిష్కారంలో జడ్పీటీసీ సభ్యులందరూ బాధ్యతాయుతంగా వ్యవహరించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో అందించిన సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలోనూ, అభివృద్ధి పనులను ముందుకు నడిపించడంలోనూ జడ్పీటీసీల పాత్ర ప్రశంసనీయం. పదవీ కాలం పూర్తి చేసుకుంటున్నప్పటికీ, ప్రజలతో వారికున్న అనుబంధం నిరంతరం కొనసాగుతుందని, భవిష్యత్తులో కూడా వారు ప్రజా సేవలో ముందుంటారని ఆశిస్తూ, భగవంతుడు వారందరికీ సంపూర్ణ ఆయురారోగ్యాలతోపాటు మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించే అవకాశం కలిపించాలని ప్రార్థిస్తున్నానన్నారు.


