నెల్లూరు జిల్లాకు రూ.380 కోట్ల కేటాయింపుకుప్పం నుంచి వర్చువల్‌గా హ్యామ్ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు
నెల్లూరు నుంచి వర్చువల్‌గా హ్యామ్ (HAM) ప్రాజెక్టుల ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి
నెల్లూరు జిల్లాలో కార్పొరేషన్, నాలుగు మున్సిపాలిటీలు, ఒక నగర పంచాయతీలో హ్యామ్ పనులురోడ్లు, వీధి దీపాలు, పార్కులు, డ్రైనేజీ వంటి మౌలిక వసతులకు ప్రాధాన్యం
రాష్ట్రవ్యాప్తంగా 123 పట్టణ స్థానిక సంస్థల్లో రూ.11,360 కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన
నెల్లూరు కార్పొరేషన్‌లో రూ.240 కోట్లతో అభివృద్ధి పనులకు శ్రీకారం
నెల్లూరు జిల్లా, సెప్టెంబర్ 22(భారత్ ప్రతినిధి): పట్టణ ప్రాంతాల్లో అభివృద్ధి పనులకు అవసరమైన నిధులను సమీకరించుకుంటూ పనులను వేగంగా ముందుకు తీసుకెళ్లేందుకు రూపొందించిన హ్యామ్ (Hybrid Annuity Model) విధానం ద్వారా రాష్ట్రంలోని పట్టణ ప్రాంతాల రూపురేఖలు మారనున్నాయని నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 123 పట్టణ స్థానిక సంస్థల్లో రూ.11,360 కోట్లతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కుప్పం నుంచి వర్చువల్‌గా శంకుస్థాపన చేసిన కార్యక్రమంలో మంగళవారం ఉదయం నెల్లూరు నుంచి ఎంపీ వేమిరెడ్డి పాల్గొన్నారు. నెల్లూరు జిల్లాకు రూ.380 కోట్లు హ్యామ్ కింద నెల్లూరు జిల్లాకు రూ.380 కోట్ల నిధులు కేటాయించినట్లు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తెలిపారు. ఇందులో భాగంగా నెల్లూరు కార్పొరేషన్‌లో రూ.240 కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన జరిగినట్లు చెప్పారు. నెల్లూరు కార్పొరేషన్‌తో పాటు జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీలు, ఒక నగర పంచాయతీలో అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు వెల్లడించారు.పట్టణ ప్రాంతాల్లో అభివృద్ధి పనులు నిధుల కొరత కారణంగా నిలిచిపోకుండా ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో హ్యామ్ విధానాన్ని రూపొందించినట్లు ఎంపీ తెలిపారు. ఈ విధానంలో ప్రాజెక్టు మొత్తం వ్యయంలో 40 శాతం ప్రభుత్వ వాటాగా ఉంటుందని, మిగిలిన మొత్తాన్ని ప్రైవేట్ భాగస్వామి ద్వారా సమకూర్చుకునే విధానం ఉంటుందని వివరించారు. ప్రైవేట్ భాగస్వామి భరించిన మొత్తాన్ని 10 ఏళ్ల వ్యవధిలో వాయిదాల రూపంలో వడ్డీతో కలిపి తిరిగి చెల్లించే విధానం ఉంటుందని చెప్పారు.నెల్లూరు రూపురేఖల్లో మార్పు: నెల్లూరు నగరంలో ఇప్పటికే దాదాపు రూ.1,000 కోట్ల విలువైన టెండర్లు పూర్తయినట్లు ఎంపీ వేమిరెడ్డి గారు తెలిపారు. ఆయా పనులు పూర్తయితే నగరంలో రోడ్లు, వీధి దీపాలు, పార్కులు, డ్రైనేజీతో పాటు ఇతర మౌలిక వసతులు మెరుగుపడతాయని చెప్పారు. హ్యామ్ విధానం ద్వారా రాష్ట్రంలోని మున్సిపాలిటీల్లో కూడా పట్టణ మౌలిక వసతుల అభివృద్ధికి అవకాశం ఏర్పడుతుందని పేర్కొన్నారు. ప్రజలకు మెరుగైన పట్టణ వాతావరణం, పర్యావరణం, మౌలిక వసతులు అందించాలనే లక్ష్యంతో ఈ స్థాయిలో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నట్లు ఎంపీ తెలిపారు. పట్టణాలతో పాటు గ్రామీణ ప్రాంతాల్లోనూ అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని చెప్పారు. వీబీ జీ రామ్ జీ ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి: ఈ నెల 29వ తేదీన వరికుంటపాడు మండలం రామాపురంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కల్యాణ్ చేతుల మీదుగా ‘పల్లె పండగ 3.0’ కార్యక్రమం ప్రారంభం కానున్నట్లు ఎంపీ తెలిపారు. దాదాపు రూ.10 వేల కోట్లతో గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు చెప్పారు. హ్యామ్ ద్వారా పట్టణ ప్రాంతాల్లో, పల్లె పండగ 3.0 ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల అభివృద్ధికి అవకాశం ఏర్పడుతోందని ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు.స్థానిక ఎన్నికలకు సిద్ధం కావాలి: రాష్ట్రంలో ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై ప్రజలకు అవగాహన కల్పించాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలపై ఉందని ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తెలిపారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని పట్టణాల్లో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించాలని సూచించారు. నెల్లూరు కార్పొరేషన్‌లో 72 డివిజన్లలోనూ పార్టీ అభ్యర్థుల విజయానికి సమష్టిగా కృషి చేయాలని ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పిలుపునిచ్చారు.


