Wednesday, October 28, 2026
spot_imgspot_img

ఉత్తమ నెలవంక.. బాపట్ల సూర్యలంక..!

Must read

📰 Generate e-Paper Clip

‘బెస్ట్ బీచ్ గా బాపట్ల’

ఎంపిక వటం పట్ల ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ హర్షం

అపురూప నెలవంకగా నిలిచిన బాపట్ల సూర్యలంక సముద్ర తీరం

బాపట్ల, 29 సెప్టెంబర్ 2026, భారత్ ప్రతినిధి న్యూస్: రాష్ట్రస్థాయిలో ఉత్తమ బీచ్ గా ఎంపికవటం ఎంతో గర్వకారణంగా ఉందని బాపట్ల శాసనసభ్యులు వేగేశన నరేంద్ర వర్మ రాజు అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముందుచూపుతోనే బాపట్ల సూర్యలంకకు ఈ స్థాయి అర్హత లభించిందని పేర్కొన్నారు.ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రపంచ పర్యాటక దినోత్సవ వేడుకల సందర్భంగా ప్రముఖ పర్యాటక కేంద్రమైన సూర్యలంక సముద్ర తీరానికి రాష్ట్రస్థాయిలో ఉత్తమ బీచ్అవార్డు దక్కింది. సూర్యలంకకు ఈ ప్రతిష్ఠాత్మక గుర్తింపు తనకెంతో సంతోషాన్ని ఇచ్చిందని ఎమ్మెల్యే పేర్కొన్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే నరేంద్ర వర్మ మాట్లాడుతూ, సూర్యలంక బీచ్‌కు రాష్ట్రస్థాయిలో ఉత్తమ గుర్తింపు రావడం బాపట్ల జిల్లా ప్రజలందరికీ గర్వకారణమని కొనియాడారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి పర్యాటక రంగ అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని, అందులో భాగంగానే సూర్యలంక తీరాన్ని అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ ‘స్వదేశీ దర్శన్ 2.0’ కింద మంజూరైన నిధులతో పాటు రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో బీచ్ పరిసరాల్లో మౌలిక వసతులు, పర్యాటకుల భద్రత, ఆధునిక సదుపాయాలను మరింత మెరుగుపరుస్తామని ఆయన పేర్కొన్నారు. సూర్యలంక బీచ్‌ను ‘గోవా తరహా’ పర్యాటక ప్రాంతంగా మార్చడమే తమ లక్ష్యమని, భవిష్యత్తులో మరిన్ని జాతీయ, అంతర్జాతీయ పురస్కారాలు దక్కేలా అభివృద్ధి పనులను వేగవంతం చేస్తామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ఈ అరుదైన గౌరవం దక్కేందుకు కృషి చేసిన పర్యాటక శాఖ అధికారులకు, జిల్లా యంత్రాంగానికి ఆయన ప్రత్యేక అభినందనలు తెలియజేశారు.

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest article

App Icon

Install Bharath Prathinidhi News App

Add to home screen for faster loading and latest updates.