చెరుకుపల్లి ఎస్సై కందుల కృష్ణ తిరుపతిరావు
చెరుకుపల్లి, 22 సెప్టెంబర్ 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : బాపట్ల జిల్లా ఎస్పీ బి. ఉమామహేశ్వర్ ఆదేశాల మేరకు, రాజోలు గ్రామ పరిధిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు వివిధ చట్టాలు, రక్షణ నిబంధనలపై ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా చెరుకుపల్లి ఎస్సై కందుల కృష్ణ తిరుపతిరావు మాట్లాడుతూ విద్యార్థి దశ నుంచే సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, సోషల్ మీడియా వినియోగంలో జాగ్రత్తలు పాటించాలని సూచించారు. సమాజాన్ని పట్టిపీడిస్తున్న డ్రగ్స్, మత్తు పదార్థాల బారిన పడి బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని హెచ్చరించారు. రహదారి భద్రతకు సంబంధించి ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలను తప్పక పాటించాలని తెలిపారు. అలాగే మహిళలు, చిన్నారుల రక్షణకు సంబంధించిన చట్టాలు, ఆపద సమయాల్లో పోలీసులను సంప్రదించే మార్గాలపై విద్యార్థులకు సమగ్ర అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.


