: లీగ్ అధ్యక్షుడు డి శ్రీ కృష్ణ ప్రసాద్
బాపట్ల, 29 సెప్టెంబర్ 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : మాజీ సైనికులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి అందరూ ఐక్యంగా కృషి చేయాలని ఆంధ్రప్రదేశ్ ఎక్స్-సర్వీసెస్ లీగ్ అధ్యక్షుడు డి. శ్రీ కృష్ణ ప్రసాద్ పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ ఎక్స్-సర్వీస్ లీగ్ ఆధ్వర్యంలో ఆదివారం బాపట్ల అక్బర్ పేటలోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ భవన్ లో సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి లీగ్ అధ్యక్షుడు డి. శ్రీ కృష్ణ ప్రసాద్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మాజీ సైనికులు ఎదుర్కొంటున్న సమస్యలు,సంక్షేమం, తదితర అంశాలపై విస్తృతంగా చర్చించారు. మాజీ సైనికుల హక్కుల పరిరక్షణకు తగిన కార్యాచరణ రూపొందించుకోవాలని సూచించారు. లైఫ్ సర్టిఫికెట్, ఈసీహెచ్ఎస్ కార్డ్స్ రెన్యూల్ , కోర్టు తదితర సేవల పేరుతో కొందరు డబ్బులు వసూలు చేసి మాజీ సైనికులను మోసం చేస్తున్నారని, అటువంటి వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. ఆయా సేవలను ఉచితంగా పొందేందుకు ఆంధ్రప్రదేశ్ ఎక్స్ సర్వీసెస్ లీగ్ ను సంప్రదించాలని సూచించారు. ప్రభుత్వ అధికారులు, మాజీ సైనికుల మధ్య ఎదురవుతున్న సమస్యలు, అన్యాయాలపై సభ్యులు చర్చించారు. సమస్యల పరిష్కారానికి మాజీ సైనికులంతా ఐక్యంగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. అనంతరం పలువురు మాజీ సైనికులను అసోసియేషన్ సభ్యులు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు అన్నలదాసు శాంతయ్య ముఖ్య కార్యదర్శి వేణుగోపాల్ కొలసాని,జాయింట్ సెక్రటరీ అబ్దుల్ సలాం, ట్రెజరర్ చిన్న వీరయ్య, సభ్యులు జెట్టి జోసెఫ్, కాగిత మాణిక్యరావు, షేక్ కాలేషా, APESL బాపట్ల జిల్లా అధ్యక్షులు శ్రీ ఆవుల వెంకటేశ్వర్లు,బాపట్ల జిల్లా జనరల్ సెక్రటరీ శ్రీ వంశీకృష్ణ వెలిచర్ల, బాపట్ల జిల్లా కోశాధికారి షేక్ అఖిల్ తదితర మాజీ సైనికులు పాల్గొన్నారు. ఈ సమావేశం అనంతరం జనగణమన గీతాలాపన తో ఈ కార్యక్రమం విజయవంతం గా ముగిసినది APESL రాష్ట్ర అధ్యక్షులు వారు డి. శ్రీ కృష్ణ ప్రసాద్ గారు ఈ కార్యక్రమం లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా మీడియా మిత్రులకు హృదపూర్వక ధన్యవాదములు తెలియజేసారు


