Thursday, September 10, 2026
spot_imgspot_img

జగనన్న కాలనీలో తక్షణం మౌలిక సదుపాయాలు కల్పించాలి

Must read

📰 Generate e-Paper Clip

రేపల్లె, 08 సెప్టెంబర్ 2026, భారత్ ప్రతినిధి : రేపల్లె ఎన్టీఆర్ నగర్ పాత జగనన్న కాలనీలో గుంతలు రోడ్ల మీద పెరిగినా రెల్లి, పిచ్చిచెట్లు, ఖాళీ స్థలాల్లో కాలనీ మొత్తం పెరిగిన రెల్లి తొలగించాలని, రెండు నెలలు పైగా బజార్ లైట్లు సుమారు 70 స్తంభాలు వరకు వెలగకుండా ఉన్న వాటికి, తక్షణం కొత్త లెట్లు వేయటం లేదు తక్షణం మౌలిక సదుపాయాలు కల్పనలో భాగంగా రోడ్లు నిర్మాణం పనులు ప్రారంభించాలని కాలనీ అభివృద్ధి కమిటీ గౌరవాధ్యక్షులు, సిపిఎం రేపల్లె పట్టణ కార్యదర్శి సిహెచ్. మణిలాల్ డిమాండ్ చేశారు. జగన్ కాలనీ సమస్యల మీద దేవుడు చెట్టు వద్ద మంగళవారం జరిగిన కాలనీ అభివృద్ధి కమిటీ సమావేశం సందర్భంగా కాలనీలో రోడ్ల మీద పెరిగిన రెల్లి, వెలగని వీధిలైట్లను, మట్టి రోడ్లమీద నీళ్లు నిలబడిన గొంతులను కానీ అభివృద్ధి కమిటీ సభ్యులు, సీపీఎం నేతలు పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా సిహెచ్.మణిలాల్ మాట్లాడుతూ రేపల్లె పట్టణంలో నూతనంగా ఏర్పడిన కాలనీనీ అభివృద్ధి చేయడానికి స్థానిక ప్రజా ప్రతినిధులు,అధికారులు పూనుకోవాలని కోరారు.అత్యధిక మంది పేదల నివాసం ఉంటున్న ఎన్టీఆర్ నగర్ పాత జగన్ కాలనీలో మౌలిక సదుపాయాలు కల్పించడం కోసం అధికారులు కృషి చేయడం లేదు,మట్టి రోడ్లు కావడంతో పెద్ద ఎత్తున రెల్లి, ముళ్ళ చెట్లతో అడవి లాగ పెరుగుతున్నప్పటికీ ఎన్నిసార్లు చెప్తున్నా మున్సిపల్ అధికారులు పట్టించుకోవటం లేదు. కలెక్టర్ గ్రీవెన్స్ పిజిఆర్ఎస్ లో ఫిర్యాదులు చేసిన సమస్యలు పరిష్కరించకుండానే ఫిర్యాదులను క్లోజ్ చేస్తూ ఏదో ఒక ఆటంకాలు చెప్తూ వస్తున్నారని ప్రజలు వాపోతున్నారు. రెండు నెలల కాలంలో సుమారు 70కి పైగా స్తంభాలకు వీధిలైట్లు మాడిపోవడంతో అనేక బజారులో ప్రజలు చీకటమయంలో పాముల మధ్య నడుస్తూ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తక్షణం ప్రజలు నివాసానికి అనుకూలంగా, రోడ్లమీద రెల్లి, ముళ్ళ చెట్లను తొలగించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా తక్షణం జగన్ కాలనీలో ప్రధాన మెయిన్ రోడ్లన్నీ నిర్మాణం పనులు ప్రారంభించాలని కోరారు. ఈ సమావేశంలో కాలనీ అభివృద్ధి కమిటీ సభ్యులు ఎస్ కే.షకీరా, సింధు, వెంకటేశ్వరమ్మ, నాంచారమ్మ, రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest article

App Icon

Install Bharath Prathinidhi News App

Add to home screen for faster loading and latest updates.