గుంటూరు, 08 సెప్టెంబర్ 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ప్రతి సంవత్సరం ‘ఇన్సూరెన్స్ వీక్’ సెలబ్రేషన్స్‌లో భాగంగా విద్యార్థుల కోసం దేశవ్యాప్తంగా వ్యాసరచన పోటీలను (Essay Writing Competitions) నిర్వహిస్తుంది. ప్రస్తుత 2026 సెప్టెంబర్‌లో ఎల్‌ఐసి తన 70వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్న సందర్భంగా వివిధ ప్రాంతాల్లోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలల విద్యార్థులకు ఈ పోటీలను నిర్వహించారు. గుంటూరు లో ఎల్‌ఐసి వారు నిర్వహించిన వ్యాసరచన పోటీలలో టార్గెట్ జూబిలేషన్ హై స్కూల్ విద్యార్ధులు వి. అక్షయ ప్రథమ బహుమతి, పి. విశాలి ద్వితీయ బహుమతి, పి. యశస్విని మరియు డి. సనా తృతీయ స్థాయిలో విజేతలుగా నిలిచారు.


ఈ సంధర్భంగా విజేతలుగా నిలిచిన విద్యార్థులకు డైరెక్టర్స్ పోనిగేటి రామకృష్ణ రెడ్డి, టి.వి.సుబ్బారావు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్స్ పి. పద్మిని, కె. మంజు ప్రియ, ఎవో లు జయరామ్ రెడ్డి, ఇంచార్జీలు టి. తిరుమల రెడ్డి, వై. గణేష్, కె. శ్రీను తదితరులు పాల్గొన్నారు.


