Thursday, September 10, 2026
spot_imgspot_img

రేపల్లె సబ్ జైలులో రిమాండ్ ఖైదీ ఆత్మహత్య ప్రయత్నం

Must read

📰 Generate e-Paper Clip

రేపల్లె, 12 ఆగస్టు 2026, భారత ప్రతినిధి న్యూస్ : సబ్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న వి. శ్రీనివాసరావు అనే వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం స్థానికంగా సంచలనం సృష్టించింది. ఒక వృద్ధురాలి హత్య కేసులో శ్రీనివాసరావును పోలీసులు అరెస్ట్ చేసి రేపల్లె సబ్ జైలుకు రిమాండ్ ఖైదీగా తరలించారు. ఈ క్రమంలో, జైలులోని వంటగదిలో ఉన్న కూరగాయలు కోసే కత్తితో అతను తన గొంతు కోసుకుని ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించాడు. తీవ్ర రక్తస్రావంతో ఉన్న శ్రీనివాసరావును గమనించిన జైలు సిబ్బంది తక్షణమే స్పందించి, అతడిని రేపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అందించిన అనంతరం, పరిస్థితి విషమంగా ఉండటంతో వైద్యుల సూచన మేరకు మెరుగైన వైద్యం కోసం తెనాలి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తెనాలి ప్రభుత్వ వైద్యశాల వైద్యుల సిఫార్సు మేరకు గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై జైలు అధికారులు ఫిర్యాదు మేరకు రేపల్లె పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest article

App Icon

Install Bharath Prathinidhi News App

Add to home screen for faster loading and latest updates.