రేపల్లె సబ్ జైలులో రిమాండ్ ఖైదీ ఆత్మహత్య ప్రయత్నం
రేపల్లె, 12 ఆగస్టు 2026, భారత ప్రతినిధి న్యూస్ : సబ్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న వి. శ్రీనివాసరావు అనే వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం స్థానికంగా సంచలనం సృష్టించింది. ఒక వృద్ధురాలి హత్య కేసులో శ్రీనివాసరావును పోలీసులు అరెస్ట్ చేసి రేపల్లె సబ్ జైలుకు రిమాండ్ ఖైదీగా తరలించారు. ఈ క్రమంలో, జైలులోని వంటగదిలో ఉన్న కూరగాయలు కోసే కత్తితో అతను తన గొంతు కోసుకుని ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించాడు. తీవ్ర రక్తస్రావంతో ఉన్న శ్రీనివాసరావును గమనించిన జైలు సిబ్బంది తక్షణమే స్పందించి,...