ట్రాఫిక్ ఆర్ఐ కృష్ణ ఆధ్వర్యంలో వాహనదారులకు అవగాహన కార్యక్రమం
ఎన్.టి.ఆర్ జిల్లా (ఇబ్రహీంపట్నం), 30 జూలై 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : హెల్మెట్ ధరించి వాహనాలు నడపాలని,హెల్మెట్ పెడితే పెట్టుకోవడంతో పాటు క్లిప్ కూడా పెట్టుకోవాలని వాహనదారులకు ట్రాఫిక్ ఆర్ ఐ కృష్ణ సూచించారు. ఇబ్రహీంపట్నం లోని రింగ్ సెంటర్ వద్ద వాహనదారులకు హెల్మెట్ గురించి అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హెల్మెట్ మాత్రమే ధరించడం కాకుండా, దానికి ఉన్న క్లిప్ ను కూడా పెట్టుకోవాలని తెలిపారు. దానివలన మనం వాహనం పై ప్రయాణించేటప్పుడు అనుకోకుండా వాహనం పై నుండి కింద పడిపోతే హెల్మెట్ జారిపోకుండా ఉండి,మనకు ప్రమాదం జరగకుండా ఉండే అవకాశం ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ తో పాటు ట్రాఫిక్ సిబ్బంది మరియు వాహనదారులు పాల్గొన్నారు.


