Thursday, September 10, 2026
spot_imgspot_img

రివ్యూలు కాదు.. రిజల్ట్ కావాలి : సీఎం చంద్రబాబు

Must read

📰 Generate e-Paper Clip

గత సమావేశంలో నిర్ణయాలపై యాక్షన్ టేకెన్ రిపోర్ట్ కావాలన్న సీఎం

ఈగోలు వద్దు.. ప్రజా సేవకులుగా ఉందాం..

8వ జిల్లా కలెక్టర్ల సదస్సులో కలెక్టర్లకు సీఎం చంద్రబాబు సూచన

• ఈగోలు లేకుండా ప్రజల కోసం పనిచేద్దాం. ప్రజా సేవకులుగా నిలుద్దాం.
• సాధించింది చెబుదాం.. సమస్యలను పరిష్కరిస్తూ ముందుకు సాగుదాం.
• 7వ కలెక్టర్ల సదస్సులో తీసుకున్న నిర్ణయాలను కూడా చర్చించుకుని లక్ష్యానికి చేరువ అవుదాం.
• ఈసారి లీడర్షిప్ అంశంపై కలెక్టర్ల సదస్సులో ప్రత్యేకంగా చర్చించాలని నిర్ణయించాం.
• రాష్ట్ర పునర్ని్ర్మాణంలో 27 నెలల్లో రాష్ట్ర ఆర్ధికవ్యవస్థను గాడిన పెట్టాం.
• రూ. 1.40 లక్షల కోట్లు సంక్షేమానికి, రూ. 1.50 లక్షల కోట్లు అభివృద్ధికి ఖర్చు చేశాం.
• రాయలసీమ రైజింగ్, కోస్తాంధ్ర భవిష్యత్ కొత్త పుంతలు, ఉత్తరాంధ్ర కలలకు రెక్కలు పేరిట ప్రగతి కార్యక్రమాలు చేపట్టాం.
• హంద్రీనీవా, వెలిగొండ ఫేజ్ -1 , పోలవరం ఎడమ కాలువ, భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రాజెక్టులు పూర్తి చేశాం.
• పోలవరం ప్రాజెక్టును 2027 మార్చినాటికల్లా పూర్తి చేసి జాతికి అంకితం చేస్తాం.
• అమరావతిలో సీడ్ యాక్సెస్ రోడ్డును పూర్తి చేసి గుంటూరు, విజయవాడకు రాజధానిని కనెక్టు చేశాం.
• ఎకనామిక్ టైమ్స్ పత్రిక సీఈఓ సీఈఓ టూ వాటర్ మాన్ అంటూ కథనం రాసింది. సంతోషం కలిగింది.
• గ్లోబల్ డ్రీమ్ కేబినెట్లో నా పేరు వచ్చినప్పుడు, సీఈఓ సీఎం అన్నప్పుడు నేను ఇంత ఆనందించలేదు.
• రాష్ట్రంలోని భౌగోళిక అసమానతల కారణంగా కొన్ని ప్రాంతాల్లో నీటి ఒత్తిడి ఉంది. దానిని సరిచేస్తూ నీటిని ఆయా ప్రాంతాలకు నీటిని ఇవ్వగలిగితే కలిగే సంతోషం వేరు.
• గోదావరి- కావేరీ- మహానది- గంగా లాంటి నదులు అనుసంధానమై వాటర్ గ్రిడ్ ఏర్పాటు చేస్తే భారత అభివృద్ధి అన్ స్టాపబుల్.
• ఈ నీటి భద్రత, సంరక్షణా చర్యల్ని గుర్తించి వాటర్ మాన్ గా పేరు పెట్టినందుకు సంతోషంగా ఉంది.
• 36 ప్రాజెక్టులు చేపట్టేందుకు క్యాలెండర్ కూడా ఇచ్చాం. వాటిని పూర్తి చేయాల్సిన బాధ్యత అందరి మీద ఉంది.
• ప్రధాని మోదీ, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సహకారం అధికారుల తోడ్పాటుతో ఈ విజయాలను సాధించగలిగాం.
• ఇప్పటి దాకా సాధించిన ఏ ఒక్కరి వల్లో సాధ్యం కాలేదు.. మంత్రులు, అధికారులు, ఉద్యోగులు, ప్రజా ప్రతినిధులు.. ఇలా అందరి వల్ల సాధ్యమైంది. ఈ విజయం టీమ్ సక్సెస్.

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest article

App Icon

Install Bharath Prathinidhi News App

Add to home screen for faster loading and latest updates.