Friday, September 11, 2026
spot_imgspot_img

రెవెన్యూ యంత్రాంగం ప్రజల నమ్మకాన్ని నిలబెట్టేలా పనిచేయాలి

Must read

📰 Generate e-Paper Clip

జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేoధిర ప్రసాద్

కాకినాడ బ్యూరో, 30 జూలై 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : రీ-సర్వే మరియు భూ రికార్డుల స్వచీకరణ, నిర్వహణ వంటి ప్రధాన ప్రభుత్వ లక్ష్యాల సాధన లో రెవెన్యూ యంత్రాంగం కీలక పాత్ర పోషించి, ప్రజల నమ్మ కాన్ని నిలబెట్టే విధంగా అధికారులు బాధ్యతా యుతం గా పనిచేయాలని జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేoధిర ప్రసాద్ స్పష్టం చేశారు. గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో రెవెన్యూ అంశాలపై ఆర్ డి ఓ లు, తహశీల్దార్ల తో కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. రీ-సర్వే 4,5 దశల్లో గ్రౌండ్ ట్రూతీoగ్,13 నోటిఫికేషన్, ఈ-కేవైసీ,పట్టాదారు పాస్‌ పుస్తకాల ముద్రణ, జాయింట్ ఎల్‌పీఎం కేసుల పరిష్కారం,రెవెన్యూ రికార్డుల స్వచ్ఛకరణ, వెబ్‌ ల్యాండ్ డేటా అప్‌డేట్, పట్టాదారు పాస్‌పుస్తకాల పంపిణీ తదితర అంశాల పురోగతిని ఈ సందర్భంగా కలెక్టర్ సమీక్షించారు.​
జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా పరిపాలన లో రెవెన్యూ శాఖ ముందుండి నడవాలని,ప్రభుత్వ పని తీరు పట్ల విశ్వసనీయత పెరుగుదలకు అధికారులు బలమైన పునాది కావాలన్నారు.ప్రతి మంగళ వారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి,మరియు భూ పరిపాలన ముఖ్య కార్యదర్శులు రెవెన్యూ అంశాలు, రీ-సర్వేపై సమీక్ష నిర్వహిస్తున్నందున, ప్రతి రెవెన్యూ అధికారి నిర్దేశిత లక్ష్యాలను నిర్దేశిత కాల పరిమితి లోగా సాధించాలని ఆదేశించారు.ప్రజా సమస్యల పరిష్కారంలో చురుకుదనం, సమయ పాలన మరియు క్షేత్ర స్థాయి ధృవీకరణ తప్పనిసరిగా ఉండాలని తేల్చి చెప్పారు. జిల్లా లో రెవెన్యూ పరిపాలన ను మరింత పార దర్శకంగా,వేగవంతంగా తీర్చిదిద్దాలని అధికారుల ను ఆదేశించారు. నవంబర్, డిసెంబర్ నెలల్లో చేపట్ట నున్న పట్టాదారు పాస్‌ పుస్తకాల పంపిణీ కార్య క్రమానికి ఇప్పటి నుండే సర్వే ప్రక్రియ పూర్తి చేసి, పుస్తకాల ముద్రణకు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమానికి గౌ. ముఖ్యమంత్రి వర్యులు విచ్చేసే అవకాశం ఉందని, అదేవిధంగా ముఖ్య మంత్రి పర్యటన లో భాగంగా తాహశీల్దార్ కార్యాలయాల సందర్శన కూడా ఉండే అవ కాశం ఉన్నందున తహ శీల్దార్లు పూర్తి సన్నద్ధంగా ఉండాలని స్పష్టం చేశారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల ఫలాలు అర్హులందరికీ చేరేలా కృషి చేయాలని పిలుపునిచ్చారు.పరిపాలన లో బాధ్యతాయుత ధోరణి, మెరుగైన సుపరిపాలన అందించడంపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. జిల్లా అభివృద్ధి, పరిపాలనా సామర్థ్యం మరియు సేవల నాణ్యత పెంపు లక్ష్యాల సాధనలో ప్రతి రెవెన్యూ అధికారి ఫలితాల ఆధారిత పనితీరు కనబరచాలని జిల్లా కలెక్టర్ తెలిపారు.​ ఈ సమీక్షా సమావేశంలో జిల్లా జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్, ఆర్డీవోలు ఎస్. మల్లి బాబు, పి. కృష్ణ మూర్తి, అలాగే వివిధ మండలాల తహశీల్దార్లు మరియు రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest article

App Icon

Install Bharath Prathinidhi News App

Add to home screen for faster loading and latest updates.