Thursday, September 10, 2026
spot_imgspot_img

నోటీసులు అందుకున్న ఓటర్లు విచారణకు హాజరుకావాలి

Must read

📰 Generate e-Paper Clip

మున్సిపల్ కమిషనర్ పి. శ్రీహరి బాబు

చిలకలూరిపేట, 10 సెప్టెంబర్ 2026 : ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ (SIR-2026) కార్యక్రమంలో భాగంగా ‘నో మ్యాపింగ్’ మరియు ‘అనామలీస్’ సమస్యలపై నోటీసులు అందుకున్న పట్టణ ఓటర్లు ఈ నెల 11వ తేదీ (11.09.2026) లోపు మున్సిపల్ కార్యాలయంలో జరిగే విచారణకు విధిగా హాజరుకావాలని సహాయ ఓటరు నమోదు అధికారి, మున్సిపల్ కమిషనర్ పి శ్రీహరి బాబు ఒక ప్రకటనలో తెలిపారు. నోటీసులు అందుకున్న వారు తమ వెంట అవసరమైన ఆధారాలు, ధృవీకరణ పత్రాలను తీసుకువచ్చి తమ ఓటు హక్కును తుది జాబితాలో ఖాయపరచుకోవాలని సూచించారు. నోటీసులు పొంది కూడా విచారణకు హాజరుకాని వారి ఓట్లను తుది ఓటర్ల జాబితా నుండి శాశ్వతంగా తొలగిస్తామని ఆయన స్పష్టం చేశారు. దీనిపై ఏవైనా సందేహాలు లేదా ఇతర సమాచారం కోసం సంబంధిత బూత్ లెవల్ అధికారులను (బీఎల్ఓ) సంప్రదించాలని కమిషనర్ కోరారు.

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest article

App Icon

Install Bharath Prathinidhi News App

Add to home screen for faster loading and latest updates.