Friday, September 11, 2026
spot_imgspot_img

ముగిసిన యూట్యూబర్ నందన విచారణ

Must read

📰 Generate e-Paper Clip

విచారణలో తనకు ఏమీ తెలియదని నందన

ఈ వ్యవహారం మొత్తం తన భర్త మధుకర్ చూసుకుంటాడని తెలిపిన నందన

అన్ని ప్రశ్నలకు దాటవేత సమాధానాలు

నందన భర్త మధుకర్ విచారణకు పిలిచే అవకాశం

కేసులో అనేక కీలక ప్రశ్నలకు లభించని సమాధానం

ఈ నెల 16న మరోసారి విచారణకు రావాలని నోటీసులు ఇచ్చిన ఇబ్రహీంపట్నం పోలీసులు

విచారణ అనంతరం వివరాలు వెల్లడించిన ఇబ్రహీంపట్నం సీఐ సుబ్రహ్మణ్యం

ఇబ్రహీంపట్నం, 08 సెప్టెంబర్ 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : లండన్ ఉద్యోగాలు, వీసా మోసం ఆరోపణల కేసులో ప్రముఖ యూట్యూబర్ (నందూస్ వరల్డ్) రామా నందన పోలీసు విచారణ నేటితో (సెప్టెంబర్ 8, 2026) ముగిసింది. నిన్న శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఇమ్మిగ్రేషన్ అధికారులు లుకౌట్ నోటీసు ఆధారంగా ఆమెను అదుపులోకి తీసుకోగా, అనంతరం ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం పోలీసులు ఆమెను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. నేడు న్యాయవాదులతో కలిసి ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్‌లో విచారణకు హాజరైన నందనను పోలీసులు సుదీర్ఘంగా ప్రశ్నించారు. విచారణలోని ముఖ్య అంశాలు:భర్తపై నెట్టేసిన నందన: పోలీసుల విచారణలో ఈ వీసా స్కామ్‌తో తనకు ఎలాంటి సంబంధం లేదని, లండన్ ఉద్యోగాలు, వీసాల వ్యవహారమంతా తన భర్త మధుకరే చూసుకునేవారని నందన తెలిపినట్లు సమాచారం. దాటవేత సమాధానాలు: విచారణలో పోలీసులు అడిగిన పలు కీలక ప్రశ్నలకు నందన నేరుగా సమాధానం చెప్పకుండా దాటవేసినట్లు పోలీసులు వెల్లడించారు. మరోసారి విచారణకు నోటీసులు: కేసులో పూర్తి వివరాలు రాబట్టేందుకు నందనకు పోలీసులు 41A నోటీసులు జారీ చేశారు. ఈ నెల సెప్టెంబర్ 16న మరోసారి విచారణకు హాజరుకావాలని ఆదేశించారు. అలాగే ఆమె భర్త మధుకర్‌ను కూడా త్వరలోనే విచారణకు పిలిచే అవకాశం ఉంది. మీడియాకు ముఖం చాటేసి: విచారణ ముగిసిన అనంతరం పోలీస్ స్టేషన్ నుంచి బయటకు వచ్చిన నందన, అక్కడ ఉన్న మీడియా కంటపడకుండా ముఖం దాచుకుంటూ పరుగున కారు ఎక్కి వెళ్లిపోయారు. అసలు కేసు ఏంటి?యూకేలో ఉద్యోగాలు, వీసా ఎక్స్‌టెన్షన్స్, స్పాన్సర్‌షిప్ సర్టిఫికెట్లు (CoS) ఇప్పిస్తామంటూ ‘డెస్టినీ కన్సల్టెన్సీ’ పేరిట దాదాపు 100 మంది బాధితుల నుంచి ఒక్కొక్కరి వద్ద రూ. 15 లక్షల నుండి రూ. 20 లక్షల వరకు వసూలు చేసి మోసం చేశారనేది నందన దంపతులపై ఉన్న ప్రధాన ఆరోపణ. బాధితుడు శివక్రాంతి కుమార్ ఇచ్చిన ఫిర్యాదుతో ఇబ్రహీంపట్నం పోలీసులు ఈ చీటింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే, తాము ఎవరినీ మోసం చేయలేదని, తమపై కావాలనే కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని నందన గతంలో ఒక వీడియో ద్వారా పేర్కొన్నారు.

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest article

App Icon

Install Bharath Prathinidhi News App

Add to home screen for faster loading and latest updates.