Thursday, September 10, 2026
spot_imgspot_img

ఇంటర్ క్లబ్ రోలర్ స్కేటింగ్ స్పీడ్ ఛాంపియన్ షిప్ 2026 ప్రారంభం

Must read

📰 Generate e-Paper Clip

ముఖ్యఅతిథులుగా హాజరై ప్రారంభించిన జంపాల సీతారామయ్య, చెన్నుబోయిన చిట్టిబాబు, సీఐ సుబ్రమణ్యం

ఇబ్రహీంపట్నం, 06 సెప్టెంబర్ 2026, భారత్ ప్రతినిధి న్యూస్: ఇబ్రహీంపట్నం పవిత్ర సంగమ వద్ద ఇంటర్ క్లబ్ రోలర్ స్కేటింగ్ స్పీడ్ ఛాంపియన్ షిప్ 2026 ఆదివారం నిర్వహించారు. ముఖ్య అతిథులుగా తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు జంపాల సీతారామయ్య, కొండపల్లి మున్సిపల్ చైర్మన్ చెన్నుబోయిన చిట్టిబాబు,సిఐ సుబ్రహ్మణ్యం హాజరయ్యారు. ఇబ్రహీంపట్నం స్కేటింగ్ కోచ్ కె. రామకృష్ణ,బి మాధవి కృష్ణ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కార్యక్రమాన్నీ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మైదానంలో ఆడేటప్పుడు శరీర ధ్రుడత్వం కన్నా మానసిక దృఢత్వం ఎంతో అవసరం అన్నారు. నేటి టెక్నాలజీ యుగంలో పిల్లలకు ఆటల పట్ల ఆసక్తి తగ్గుతుందని… తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయులు దీనిపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.అనంతరం పలు విభాగాలలోని విజేతలకు మెడల్స్ అందజేశారు. ఈ కార్యక్రమంలో స్కేటింగ్ కోచులు ఎండి కబీర్,ఎం. దిలీప్, చంటి, జడ్జిలుగా బి మురళీకృష్ణ, ఎం సుచిత్ర, పి హరిణి, ఎస్ లోకేష్ కుమార్, క్రీడాకారులు పాల్గొన్నారు.

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest article

App Icon

Install Bharath Prathinidhi News App

Add to home screen for faster loading and latest updates.