Wednesday, October 28, 2026
spot_imgspot_img

మంత్రి నారాయణ కు ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి సవాల్

Must read

📰 Generate e-Paper Clip

నెల్లూరు జిల్లా, 23 సెప్టెంబర్ 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : మంత్రి నారాయణ గత మూడు సంవత్సరాలుగా వైయస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ పై వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పై ఆరోపణలు చేస్తున్నారు. ప్రధానంగా ఆయన చేస్తున్న ఆరోపణ ఏమిటంటే గత వైసిపి ప్రభుత్వం చెత్తను తొలగిస్తామని చెప్పి చెత్త పన్ను వేసి సుమారు 83 లక్షల టన్నుల చెత్తను ఈ రాష్ట్రంలో వదిలిపెట్టి వెళ్లిందని చెబుతున్నారు. భూమి లోపల ఉన్న చెత్తను తొలగించే క్రమంలో 1.63 లక్షల టన్నుల చెత్తను కూటమి ప్రభుత్వం తొలగించిందని మంత్రి నారాయణ చెప్పుకుంటున్నారు. ఈ చెత్త తొలగింపులో జరిగిన అవినీతికి సంబందించి గత వారం రోజులుగా మీకు నేను కొన్ని ప్రశ్నలు వేయడం జరిగింది. అందులో మొట్ట మొదటిది మీరు చేసిన ఆరోపణ పూర్తి అవాస్తవం, అబద్ధమని చెప్పడం జరిగింది. రెండవది ఈ రాష్ట్రంలో చెత్త పేరుతో సుమారు 1200 కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందని కూడా నేను తెలియజేయడం జరిగింది. నెల్లూరు నగరంలో సామాన్యుల గొంతు పిండి వారి వద్ద నుంచి పన్నుల రూపంలో దోపిడీ చేసి మీ అన్యులకి, మీకు సంబంధించిన వారికి కోట్ల రూపాయలు కట్టబెట్టినట్లుగా వాస్తవాలతో సహా మీ ముందుకు వచ్చి చూపించడానికి నేను సిద్ధంగా ఉన్నట్లు చెప్పడం జరిగింది. ఈ విషయం మీద చర్చించేందుకు గత వారం రోజులుగా మీరు ఎక్కడికి చెబితే అక్కడికి వచ్చి చర్చించేందుకు సిద్ధంగా ఉన్నానని చెబుతున్నా. ఒకవేళ నేను చేసిన ఈ మూడు ఆరోపణలను నిరూపించ లేకపోతే మీకు నేను బహిరంగ క్షమాపణ చెప్పి శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకునేందుకు సిద్ధంగా ఉన్నానని తెలియజేస్తున్నాను. నేను చేసిన మూడు ఆరోపణలు నిజమని నిరూపిస్తే మీరు ప్రజలకు బహిరంగ క్షమాపణ చెబుతారా అని నారాయణను ప్రశ్నిస్తున్నాను. బహిరంగ క్షమాపణలు చెప్పడమే కాదు మీరు రాజకీయాల నుంచి శాశ్వతంగా దూరమవుతారా సమాధానం చెప్పాలని మంత్రి నారాయణను అడుగుతున్నా. నేను చెప్పిన అంశాలపై ఏ రోజైనా సరే బహిరంగ చర్చకు నేను సిద్ధమని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మీకు చిత్తశుద్ది ఉంటే చర్చకు రావాలని మంత్రి నారాయణ కోరుతున్నా. మీరు బహిరంగ చర్చకు రాలేకపోయినా ఇందుకు సంబందించిన వాస్తవ ఆధారాలను త్వరలో మీడియా ద్వారా ప్రజలకు వివరించడం జరుగుతుందని తెలియజేస్తున్నాను.

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest article

App Icon

Install Bharath Prathinidhi News App

Add to home screen for faster loading and latest updates.