Wednesday, October 28, 2026
spot_imgspot_img

సాంకేతిక నిఘాతో 22 సెల్ ఫోన్లు రికవరీ

Must read

📰 Generate e-Paper Clip

రూ. 4.70 లక్షల విలువైన ఫోన్లు బాధితులకు అందజేత

ఇబ్రహీంపట్నం, 18 సెప్టెంబర్ 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : ఇబ్రహీంపట్నం పోలీసుల సాంకేతిక నైపుణ్యానికి మరోసారి గుర్తింపు లభించింది. వివిధ సందర్భాల్లో ప్రజలు పోగొట్టుకున్న 22 సెల్ ఫోన్లను పోలీసులు రికవరీ చేశారు. పోగొట్టుకున్న ఫోన్ల వివరాలను కేంద్ర ప్రభుత్వ పోర్టల్లో నమోదు చేసి, ఫోన్ల గుర్తింపు సంఖ్య ఆధారంగా సాంకేతిక పరిజ్ఞానంతో గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. రికవరీ చేసిన ఫోన్ల మొత్తం విలువ సుమారు నాలుగు లక్షల డెబ్బై వేల రూపాయలు ఉంటుంది. అనంతరం రికవరీ చేసిన ఫోన్లను ఇబ్రహీంపట్నం వృత్తాధికారి సుబ్రహ్మణ్యం మహిళా ఉపాధికారి సత్యవతి ,నేర విభాగ ఉపాధికారి సేనాపతి శ్రీనివాసరావు బాధితులకు అందజేశారు. తమకు ఎంతో అవసరమైన ఫోన్లు తిరిగి లభించడంతో బాధితులు సంతోషం వ్యక్తం చేసి పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా వృత్తాధికారి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ ప్రజలు తమ విలువైన ఫోన్లు పోగొట్టుకున్న వెంటనే పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేయాలని, ఫోన్ గుర్తింపు సంఖ్య ఆధారంగా త్వరితగతిన రికవరీ చేసి బాధితులకు అందజేస్తామని తెలిపారు.

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest article

App Icon

Install Bharath Prathinidhi News App

Add to home screen for faster loading and latest updates.