సాంకేతిక నిఘాతో 22 సెల్ ఫోన్లు రికవరీ

రూ. 4.70 లక్షల విలువైన ఫోన్లు బాధితులకు అందజేత ఇబ్రహీంపట్నం, 18 సెప్టెంబర్ 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : ఇబ్రహీంపట్నం పోలీసుల సాంకేతిక నైపుణ్యానికి మరోసారి గుర్తింపు లభించింది. వివిధ సందర్భాల్లో ప్రజలు పోగొట్టుకున్న 22 సెల్ ఫోన్లను పోలీసులు రికవరీ చేశారు. పోగొట్టుకున్న ఫోన్ల వివరాలను కేంద్ర ప్రభుత్వ పోర్టల్లో నమోదు చేసి, ఫోన్ల గుర్తింపు సంఖ్య ఆధారంగా సాంకేతిక పరిజ్ఞానంతో గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. రికవరీ చేసిన ఫోన్ల మొత్తం విలువ సుమారు నాలుగు లక్షల డెబ్బై వేల రూపాయలు...