Thursday, September 10, 2026
spot_imgspot_img

మళ్లీ పుడతామా ఏందీ.. ?

Must read

📰 Generate e-Paper Clip

కరీంనగర్‌ యువత సమరభేరి సభలో కేటీఆర్‌

కరీంనగర్‌, 05 సెప్టెంబర్‌ 2026 : సమాజం యువత పాత్ర చాలా గొప్ప ది.. మీ పరిధి విశాలమైనది.. ఈ దేశం మీది.. భవిష్యత్తు మీది.. కాపాడుకోవాల్సి బాధ్యత కూడా మీదే. మీ పోరాటాలు కేవలం ఉద్యోగా లు, నోటిఫికేషన్లు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ వద్దనే ఆగిపోవద్దు. సమాజం గురించీ ఆలోచించాలి. మీతో పాటు సబ్బండ వర్ణాలను హామీల పేరు నమ్మించి నయవంచన చేసి ప్రభుత్వాలపై కదంతొక్కాలి. నిప్పుకణికలై మండాలె.. కాంగ్రెస్‌ను కాలిబూడిద చేసేదాకా వెంటపడాలె’ అని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ పిలుపునిచ్చారు. శనివారం కరీంనగర్‌ అంబేద్కర్‌ స్టేడియంలో నిర్వహించి విద్యార్థి, యువత సమరభేరి సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై, యువతను ఉద్దేశించి ప్రసంగించారు.ప్రపంచ పటాలు పరిశీలించండి.

రాష్ట్రంలో కాంగ్రెస్‌ విలాసమే తప్ప యువవికాసం లేదని విమర్శించారు. వంద రోజుల్లో అమలు చేస్తామని విద్యార్థి, నిరుద్యోగులకు ఇచ్చిన 24 హామీల్లో వెయ్యి రోజులు గడుస్తున్నా ఒక్కటి కూడా నెరవేర్చలేదని ధ్వజమెత్తారు. యువత, విద్యార్థుల పోరా టం ఒక్క వారి సమస్యలకే పరిమితం కాకూడదని, రాష్ట్రంలోని అన్ని వర్గాలకూ విస్తరించాల్సిన అవసరం ఉన్నదని స్పష్టంచేశారు. ఒక అన్నగా మీ వెంట ఉంటానని, బీఆర్‌ఎస్‌ దళపతి కేసీఆర్‌ మన వెంట ఉంటారని యువత, విద్యార్థిలోకాన్ని ఉద్దేశించి కేసీఆర్‌ చెప్పారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌ ఇచ్చిన హామీలను వేదికపై డిజిటల్‌ స్క్రీన్‌పై చూపిస్తూ సర్కార్‌ తీరును ఎండగట్టారు.

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest article

App Icon

Install Bharath Prathinidhi News App

Add to home screen for faster loading and latest updates.