గుంటూరు, 26 ఆగష్టు 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : గుంటూరులో హైమా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. నర్సరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు ముఖ్య అతిథిగా హాజరై నూతన హాస్పిటల్ ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్, ఎమెల్యే లు నక్కా ఆనంద్ బాబు, గల్లా మాధవి, మహ్మద్ నసీర్, డాక్టర్ బుచ్చిబాబు, డాక్టర్ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ప్రజలకు తక్కువ ఖర్చుకే నాణ్యమైన వైద్య సేవలు అందిస్తూ అందరి మన్ననలు పొందడం హైమా హాస్పిటల్ ప్రత్యేకత అని ఈ సందర్భంగా ఎంపీ, ఎమ్మెల్యేలు తెలిపారు. సాధారణ హాస్పిటల్ నుండి అత్యాధునిక సౌకర్యాలతో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభించడం ఆనందంగా ఉందని చెప్పారు.

ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా హాస్పిటల్ నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడంలో హైమ హాస్పిటల్ మరింత అభివృద్ధి చెందాలని అతిధులు ఆకాంక్షించారు.


