Friday, September 11, 2026
spot_imgspot_img

ఐజేఎం అపార్ట్మెంట్ ల్లో అనుమతి లేకుండా ఓ సినిమా షూటింగ్

Must read

📰 Generate e-Paper Clip

గుంటూరు జిల్లా పెద్దకాకాని నంబూరు ఐజేఏంలో వివాదం

100 కి కాల్ చేసిన అపార్ట్మెంట్ వాసులు

షూటింగ్ తీయటంపై స్థానిక అపార్ట్మెంట్ వాసులు తీవ్ర ఆగ్రహం

ఇళ్ళ మధ్యలో అది గేటేడ్ కమ్యూనిటీలు ఉండే చోట ఎలా అనుమతి లేకుండా సినిమా షూటింగ్ చేస్తున్నారంటు ప్రశ్నిస్తున్నారు ?

గుంటూరు/పెద్దకాకాని, 26 ఆగష్టు 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : గత కొద్ది రోజులుగా ఇదే విషయంను ప్లాట్ల యజమానులు, నివాస గృహాల మధ్య అనుమతి తీసుకోకుండా ఎలా షూటింగ్ అని నిలదీశారు. సినిమా నిర్వాహకులు అనుమతి లేకుండా తమ పనులు చేయటంతో విషయం సృతిమించటంతో స్థానికులకు, షూటింగ్ నిర్వాహకులకు స్వల్ప ఘర్షణకు తావిచ్చింది. తాము ఎదైనా చిన్న ఫంక్షన్ పెట్టుకుంటే వంద కారణాలు, అధిక మొత్తంలో డబ్బులు తీసుకునే రిసివర్ ఇప్పుడు కేవలం నామ మాత్రంగా ఎలా డబ్బులు తీసుకొని వారి అనుమతి ఇచ్చారో అంటు ప్రశ్నిస్తున్నారు. అనుమతి తీసుకోకుండా సరైన వస్త్ర దారుణ లేకుండా ఇలా చేయటంపై స్థానికులు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. లిఫ్ట్ లో సామర్ధ్యంకు మించి షూటింగ్ సామగ్రి తీసుకురావటంతో తీవ్ర అవస్థలు పడుతున్న ప్లాట్ల యజమానులు, నివాస గృహాల వారు తరచూ లిఫ్ట్ అగిపోతొందని ఆగిన సమయంలో చిన్నపిల్లలు, వృద్ధులు ఉంటే పరిస్థితి ఏంటో అని ప్రశ్నిస్తున్నారు. కోర్టు ఓ వ్యక్తి కేవలం మెయింటైన్ చేయమని చెపితే అతను అతని ఇష్టారాజ్యంగా చేస్తు ఇలా అనుమతులు ఇచ్చి తమను ఇబ్బంది పెడుతున్నారంటు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సదరు విషయంపై తమ అభ్యంతరాలను కూడా తెలియజేశామని అయినా రిసివర్ షూటింగ్ వారికే మధ్దత్తుగా ప్లాట్ ఓనర్స్ కు వ్యతిరేకంగా ఉన్నాడని విమర్శించారు. తక్షణమే సమస్య పరిష్కారం కాకపోతే సినిమా షూటింగ్ అపకపోతే తగిన రీతిలో గుణపాఠం చెపుతామని హెచ్చరించారు. పెద్దకాకాని పోలీస్ లు వచ్చి షూటింగ్ వారికి మద్దతుగా సర్దుకోవాలని అపార్టుమెంట్ వాసులకు తెలపటం విశేషం. ఈ ఘటనపై ఎలాంటి చర్యలు ఉంటాయో..! ఆ షూటింగ్ అపుతారో లేక తమకు అడ్డులేదని ముందుకు పోతారో ?

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest article

App Icon

Install Bharath Prathinidhi News App

Add to home screen for faster loading and latest updates.