జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్
ఘనంగా ‘డ్రగ్స్ వద్దు బిడ్డా’ యాడ్ ఫిలిం ప్రివ్యూ కార్యక్రమం
ముఖ్య అతిధులుగా రాజ్యసభ సభ్యులు భాష్యం రామకృష్ణ

గుంటూరు, 25 ఆగష్టు 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : డ్రగ్స్ వినియోగానికి యువత దూరంగా ఉండాలనే సందేశంతో రూపొందించిన ‘డ్రగ్స్ వద్దు బిడ్డా’ యాడ్ ఫిలిం ప్రివ్యూ కార్యక్రమం గుంటూరులో జరిగింది. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు భాష్యం రామకృష్ణ, జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ముఖ్య అతిధులుగా పాల్గొన్నారు.

ఈ సంధార్ధంగా జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ మాట్లాడుతూ డైరెక్టర్ దిలీప్ రాజా సహకారంతో “డ్రగ్స్ వద్దు బిడ్డా” యాడ్ ఫిలింను రూపొందించినట్లు ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. గత 10 నెలల్లో డ్రగ్స్ వినియోగానికి సంబంధించి 400 మందికి పైగా కేసులు నమోదు చేసినట్లు చెప్పారు. డ్రగ్స్ విక్రయించే వారిపై పీడీ యాక్ట్ ప్రయోగించి జైలుకు పంపించినట్లు వెల్లడించారు. డ్రగ్స్‌ను అరికట్టడంలో తల్లిదండ్రులు ప్రముఖ పాత్ర పోషించాలని సూచించారు. పిల్లల ప్రవర్తన, అలవాట్లను తల్లిదండ్రులు నిరంతరం గమనిస్తూ ఉండాలని కోరారు. కేవలం రెండు నిమిషాల వ్యవధిలో ఈ యాడ్ ఫిలింను రూపొందించినట్లు తెలిపారు. డ్రగ్స్ వల్ల కలిగే అనర్థాలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు మీడియా మిత్రులు ఈ యాడ్ ఫిలింను విస్తృతంగా ప్రచారం చేయాలని ఎస్పీ కోరారు.

రాజ్యసభ సభ్యులు భాష్యం రామకృష్ణ మాట్లాడుతూ యువత బాగుండాలనే మహోన్నత ఉద్దేశంతో ఎస్పీ వకుల్ జిందాల్ ఈ యాడ్ ఫిలింను రూపొందించడం మంచి పరిణామమని రాజ్యసభ సభ్యులు భాష్యం రామకృష్ణ అన్నారు. సమాజంలో డ్రగ్స్ ప్రభావం పిల్లలపై తీవ్రంగా ఉంటుందని, విద్యార్థులు మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని సూచించారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడలపై కూడా శ్రద్ధ చూపాలని కోరారు. ఒక్కసారి మాదక ద్రవ్యాలకు అలవాటు పడితే ఆ వ్యసనం జీవితాన్ని ఛిద్రం చేస్తుందని హెచ్చరించారు.

ప్రముఖ డైరెక్టర్ దిలీప్ రాజా మాట్లాడుతూ తాను ఎన్నో సినిమాలు రూపొందించానని, వాటిలో కొన్ని సినిమాలను డబ్బు కోసం తెరకెక్కిస్తామని డైరెక్టర్ దిలీప్ రాజా తెలిపారు. అయితే “డ్రగ్స్ వద్దు బిడ్డ” చిత్రాన్ని సమాజ హితం కోసం రూపొందించినట్లు చెప్పారు. ఈ యాడ్ ఫిలిం కనీసం ఒక లక్ష మంది పిల్లలు, వారి తల్లిదండ్రులకు చేరితే తమ ప్రయత్నం విజయవంతమైనట్లేనని అన్నారు. ఈ యాడ్ ఫిలిం రూపకల్పనకు సహకరించిన జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్‌కు డైరెక్టర్ దిలీప్ రాజా ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.


