Friday, September 11, 2026
spot_imgspot_img

వ్యవసాయ కార్మిక సమస్యలు పరిష్కరించాలి

Must read

📰 Generate e-Paper Clip

డి‌హెచ్‌పి‌ఎస్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద ధర్నా

గుంటూరు, 24 ఆగష్టు 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా సోమవారం గుంటూరు కలెక్టరేట్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ ధర్నాలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కాబోతూ ఈశ్వరరావు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయాలని కోరుతూ గ్రామాల్లో మూడు సెంట్లు పట్నాలో రెండు సెంట్లు ఇచ్చి ఇంటి నిర్మాణానికి ఐదు లక్షలు ఐదు లక్షల రూపాయలు పెంచి ఇవ్వాలని, అన్ని రకాల ప్రభుత్వ భూములు పేదలకు కుటుంబానికి రెండు ఎకరాలు ఇవ్వాలని, ప్రభుత్వ భూములు పేదలకు పెంచాలని, భూ సమస్యల పరిష్కరించి, 22 ఏ లో పెట్టిన పేదల ప్రభుత్వ భూములకు ఒరిజినల్ అడంగల్, వన్ బి వచ్చేలా చేసి ప్రభుత్వ నుండి అన్ని రకాల సహాయం అందించాలని, మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని యధావిధిగా కొనసాగించాలని విబిజి రాంజీ రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నాము. అంతేకాకుండా అర్హత కలిగిన పేదలందరికీ కొత్త సామాజిక పెన్షన్లను మంజూరు చేయాలని 18 సంవత్సరాలు దాటిన మహిళలందరికీ నెలకి 1500 ఇస్తామని ఇచ్చిన హామీన అమలు చేయాలని, కొత్త రేషన్ కార్డులు ప్రభుత్వ భూముల్లో నివసించే వారికి పట్టాలను మంజూరు చేయాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం గుంటూరు జిల్లా సమితి తరపున డిమాండ్ చేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు షేక్ గౌస్, గుర్రంకొండ సత్యానందం, తాడికొండ నియోజకవర్గం సిపిఐ కార్యదర్శి ముప్పాళ్ళ శివశంకరరావు, తోకల జయమ్మ, పంతగాని, మరియదాసు, డి హెచ్ పి ఎస్ జిల్లా కార్యదర్శి బెజవాడ, జిల్లా అధ్యక్షులు మిర్యాల కోటేశ్వరరావు, యాకోబు, జివి రాజు, శానం సుజాత, తోకల పాములమ్మ, నాగేశ్వరరావు, రత్నరాజు, స్వామి, చెవులపునయ్య, రమేష్, మరియమ్మ, లక్ష్మీ, చిన్న తదితరులు పాల్గొన్నారు.

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest article

App Icon

Install Bharath Prathinidhi News App

Add to home screen for faster loading and latest updates.