కేసులతో నన్ను భయపెట్టలేరు
గుంటూరు, 25 ఆగష్టు 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : రాష్ట్రంలో పోలీసులే గంజాయి సరఫరా చేస్తున్నారని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. మంగళవారం గుంటూరులో అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడుతూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం తప్పా..? అని ప్రశ్నించారు. పోస్టులు పెడితే కేసులు పెడతారా అని నిలదీశారు. గతంలో నేను ఇచ్చిన ఫిర్యాదులపై కేసులు ఎందుకు నమోదు చేయలేదన్నారు. ఒక కార్టూన్ లక్షలమందిని ఆకర్షిస్తూంది. వెన్నుపోటు పార్టీ అని ప్రతివిమర్శ చేసాం. ఇది ప్రజల్లో కి వెళ్లింది. మాజీ సీఎం పై అసభ్యంగా పోస్ట్లు చేస్తే కేసు రిజిస్టర్ చేయలేదు. నేను పలుమార్లు కంప్లైంట్ చేసా. పోలీసులు అధికార పక్షానికి కొమ్ముకాస్తున్నారు. ప్రతిపక్షం విమర్శలు చేస్తే కేసులు పెడుతున్నారు. యన్టీఆర్ పై ఆ రోజుల్లో అనేక సినిమాలు విడుదల అయ్యాయి. కృష్ణ కూడా యన్టీఆర్ పై సినిమా తీసారు, ఆయన ఎదుర్కొంటున్నారు. అప్పట్లో ఎవరిపై కేసులు నమోదు చేయలేదు. పోలీసులు గంజాయి అమ్ముతున్నారు. పోలీసులు క్లబ్బులు ఆడిస్తున్నారు. అందులో ఐజీ కి డబ్బు లు ముడుతున్నాయి. చిలకలూరిపేట, సత్తెనపల్లి, రేపల్లె పలుచోట్ల క్లబ్ లు నడుపుతున్నారు. రోజుకు 20లక్షల ఆదాయం, పోలీసులు, ప్రజాప్రతినిధులు పంచుకుంటున్నారు. నన్ను కేసులతో భయ పెట్టలేరు. నేను కార్టూన్లు ద్వారా నా అభిప్రాయం చెబుతాను. నేరం రుజువు అయ్యేదాకా నిర్దోషిని. కారుమూరు, ముస్తఫా ను జైల్లో పెట్టారు. ఏదైనా న్యాయపరంగా ఎదుర్కోంటాను. ఈ సమావేశంలో వైసీపీ లీగల్ సెల్ న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు.


