Wednesday, October 28, 2026
spot_imgspot_img

కూటమి పాలనలో ప్రజారోగ్యానికి పెద్దపీట : ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి

Must read

📰 Generate e-Paper Clip

రూ.50 లక్షలతో నిర్మించిన బీపీహెచ్‌యూ భవనం ప్రారంభం

శృంగవరపుకోట/కొత్తవలస, 19 సెప్టెంబర్ 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : కొత్తవలస గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు మెరుగైన వైద్య సేవలను మరింత చేరువ చేయడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని శృంగవరపుకోట శాసనసభ్యురాలు కోళ్ల లలితకుమారి పేర్కొన్నారు. కొత్తవలస సంత మార్కెట్ ప్రాంగణంలో ప్రధాన మంత్రి ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మిషన్ పథకం కింద 15వ ఆర్థిక సంఘం నిధులు సుమారు రూ. 50 లక్షల నిధులతో నూతనంగా నిర్మించిన బ్లాక్ పబ్లిక్ హెల్త్ యూనిట్ (BPHU) భవనాన్ని ఆమె ముఖ్య అతిథిగా విచ్చేసి ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో దాసరి కార్పొరేషన్ ఛైర్మన్ పొట్నూరు రత్నాజీ కూడా పాల్గొన్నారు.
అనంతరం ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి మాట్లాడుతూ గ్రామీణ వైద్య రంగాన్ని బలోపేతం చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా మండల స్థాయిలో అత్యాధునిక బీపీహెచ్‌యూలను ఏర్పాటు చేస్తున్నాయని తెలిపారు. ఈ యూనిట్ ద్వారా స్థానిక ప్రజల ఆరోగ్యాన్ని నిరంతరం పర్యవేక్షించడంతో పాటు, వ్యాధుల నియంత్రణకు అవసరమైన ముందస్తు సమాచారాన్ని సేకరించడం సాధ్యమవుతుందని చెప్పారు. ముఖ్యంగా అంటువ్యాధులు ప్రబలకుండా సత్వరమే గుర్తించడం, ఆధునిక ల్యాబ్ పరీక్షల ద్వారా రోగ నిర్ధారణ వేగవంతం చేయడం మరియు ప్రజల్లో నిరంతరం ఆరోగ్య స్పృహను పెంచడం వంటి కీలక బాధ్యతలను ఈ కేంద్రం నిర్వహిస్తుందని ఎమ్మెల్యే వివరించారు. ప్రజలు ఈ సదుపాయాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు, వైద్య సిబ్బంది, కూటమి పార్టీల ముఖ్య నాయకులు మరియు స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest article

App Icon

Install Bharath Prathinidhi News App

Add to home screen for faster loading and latest updates.