కూటమి పాలనలో ప్రజారోగ్యానికి పెద్దపీట : ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి
రూ.50 లక్షలతో నిర్మించిన బీపీహెచ్యూ భవనం ప్రారంభం శృంగవరపుకోట/కొత్తవలస, 19 సెప్టెంబర్ 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : కొత్తవలస గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు మెరుగైన వైద్య సేవలను మరింత చేరువ చేయడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని శృంగవరపుకోట శాసనసభ్యురాలు కోళ్ల లలితకుమారి పేర్కొన్నారు. కొత్తవలస సంత మార్కెట్ ప్రాంగణంలో ప్రధాన మంత్రి ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్ పథకం కింద 15వ ఆర్థిక సంఘం నిధులు సుమారు రూ. 50 లక్షల నిధులతో నూతనంగా నిర్మించిన బ్లాక్ పబ్లిక్ హెల్త్ యూనిట్...