గుంటూరు, 04 సెప్టెంబర్ 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : కృష్ణాష్టమి సందర్భంగా సీఎం చంద్రబాబును కలిసి శ్రీకృష్ణుడి చిత్రపటాన్ని అందించి శుభాకాంక్షలు ఎమ్మెల్యే మొహమ్మద్ నసీర్ తెలియజేశారు. గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మొహమ్మద్ నసీర్ మత సామరస్యానికి, సోదరభావానికి ప్రతీకగా నిలుస్తున్నారని తెలుగుదేశం పార్టీ నేతలు పేర్కొన్నారు. మతాలకు అతీతంగా పండుగలను గౌరవిస్తూ, పరస్పర విశ్వాసం–సోదరభావాన్ని చాటుకోవడం ద్వారా నసీర్ ఆదర్శంగా నిలిచారని వారు పేర్కొన్నారు. “మతం వేరు కావచ్చు, మనసులు ఒక్కటే. పండుగలు వేరు కావచ్చు,మన ఆనందం ఒక్కటే” అనే సందేశాన్ని తన చర్య ద్వారా ఎమ్మెల్యే చాటిచెప్పారని తెలిపారు. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో అన్ని మతాలు, వర్గాల ప్రజలను కలుపుకొని ముందుకు సాగుతున్న ఎమ్మెల్యే నసీర్, మత సామరస్యానికి నిదర్శనంగా నిలుస్తున్నారని పేర్కొన్నారు.


