
గుంటూరు, 04 సెప్టెంబర్ 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : 1వ ఆంధ్రప్రదేశ్ స్టేట్ పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్–2026 రాష్ట్రస్థాయి పోలీస్ క్రీడా పోటీలలో గుంటూరు జిల్లా పోలీస్ శాఖకు చెందిన అధికారులు, సిబ్బంది అత్యుత్తమ ప్రతిభ కనబరిచి పలు పతకాలు సాధించారు. సెప్టెంబర్ 1వ తేదీ నుంచి 4వ తేదీ వరకు మంగళగిరిలోని ఏపీఎస్పీ 6వ బెటాలియన్ ప్రాంగణంలో నిర్వహించిన ఈ రాష్ట్రస్థాయి క్రీడా పోటీలలో రాష్ట్రంలోని వివిధ
జిల్లాలు, పోలీస్ యూనిట్లకు చెందిన క్రీడాకారులు హోరాహోరీగా పోటీపడ్డారు.
గుంటూరు జిల్లా పోలీస్ క్రీడాకారులు సాధించిన విజయాలు:
ఫైరింగ్ విభాగం : గుంటూరు ఎస్బీ సీఐ ఏ. మల్లికార్జునరావు స్టెన్ గన్ ఈవెంట్లో సెకండ్ ప్లేస్, కార్బైన్ ఈవెంట్లో థర్డ్ ప్లేస్ సాధించారు.
వెయిట్ లిఫ్టింగ్: 85 కేజీల విభాగంలో స్పెషల్ బ్రాంచ్‌కు చెందిన హెడ్ కానిస్టేబుల్ మల్లికార్జునరావు గోల్డ్ మెడల్ సాధించారు.

కబడ్డీ: స్పెషల్ బ్రాంచ్‌కు చెందిన ఉమెన్ కానిస్టేబుల్ క్రాంతి కుమారి, పట్టాభిపురం పోలీస్ స్టేషన్‌కు చెందిన ఉమెన్ కానిస్టేబుల్ తిరుపతమ్మ

గుంటూరు రేంజ్ తరఫున పాల్గొని సెకండ్ ప్లేస్ సాధించారు.
హ్యాండ్ రైజింగ్: స్పెషల్ బ్రాంచ్‌కు చెందిన కానిస్టేబుల్ కాంతికుమారి సిల్వర్ మెడల్ సాధించారు.
డాగ్ స్క్వాడ్: గుంటూరు రేంజ్ డాగ్ స్క్వాడ్ రాష్ట్రస్థాయి పోటీలలో రన్నరప్‌గా నిలిచింది. కే. వేణుబాబు ఆధ్వర్యంలోని గుంటూరు డాగ్ స్క్వాడ్‌కు చెందిన ‘సింబా’ నార్కోటిక్ టెస్ట్ విభాగంలో సెకండ్ ప్లేస్ సాధించింది. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ వకుల్ జిందల్,విజేతలైన క్రీడాకారులను అభినందించారు. విధి నిర్వహణలో నిరంతరం ఒత్తిడిని ఎదుర్కొనే పోలీస్ అధికారులు, సిబ్బందికి క్రీడలు మానసిక ప్రశాంతతతో పాటు శారీరక దృఢత్వాన్ని అందిస్తాయని ఎస్పీ పేర్కొన్నారు. క్రీడలు పోలీస్ సిబ్బందిలో క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, క్రీడాస్ఫూర్తి మరియు జట్టుగా పనిచేసే లక్షణాలను పెంపొందిస్తాయని తెలిపారు. విధి నిర్వహణతో పాటు ప్రతి ఒక్కరూ శారీరక దృఢత్వం, ఫిట్‌నెస్‌కు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి పాల్గొన్న క్రీడాకారులతో హోరాహోరీగా సాగిన పోటీలలో గుంటూరు జిల్లా పోలీస్ సిబ్బంది ప్రతిభ కనబరిచి పలు పతకాలు సాధించడం పట్ల జిల్లా పోలీస్ అధికారులు, సిబ్బంది హర్షం వ్యక్తం చేశారు.


