Thursday, September 10, 2026
spot_imgspot_img

మట్టి విగ్రహాలను పూజిద్దాం పర్యావరణాన్ని కాపాడుదాం

Must read

📰 Generate e-Paper Clip

ఎమ్మెల్యే గళ్ళా మాధవి పిలుపు

గుంటూరు, 06 సెప్టెంబరు 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : వినాయక చవితి సందర్భంగా పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, మట్టి విగ్రహాలను పూజించి పర్యావరణాన్ని కాపాడాలని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గల్లా మాధవి ప్రజలకు పిలుపునిచ్చారు.కొణిదే మోహన్ గోపి కృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో పర్యావరణహిత మట్టి వినాయక విగ్రహాలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు రూపొందించిన బ్రోచర్‌ను, మట్టి వినాయక విగ్రహ ప్రతిమను ఎమ్మెల్యే గల్లా మాధవి ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్లాస్టర్ ఆఫ్ పారిస్, రసాయన రంగులతో తయారు చేసే విగ్రహాల వల్ల నీటి వనరులు కలుషితమయ్యే అవకాశం ఉందని తెలిపారు. పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ మట్టి విగ్రహాలను ప్రోత్సహించాలని, వినాయక చవితి వేడుకలను పర్యావరణహితంగా నిర్వహించాలని కోరారు. సంప్రదాయాలను కాపాడుకుంటూనే ప్రకృతిని రక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest article

App Icon

Install Bharath Prathinidhi News App

Add to home screen for faster loading and latest updates.