మట్టి విగ్రహాలను పూజిద్దాం పర్యావరణాన్ని కాపాడుదాం

ఎమ్మెల్యే గళ్ళా మాధవి పిలుపు గుంటూరు, 06 సెప్టెంబరు 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : వినాయక చవితి సందర్భంగా పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, మట్టి విగ్రహాలను పూజించి పర్యావరణాన్ని కాపాడాలని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గల్లా మాధవి ప్రజలకు పిలుపునిచ్చారు.కొణిదే మోహన్ గోపి కృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో పర్యావరణహిత మట్టి వినాయక విగ్రహాలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు రూపొందించిన బ్రోచర్‌ను, మట్టి వినాయక విగ్రహ ప్రతిమను ఎమ్మెల్యే గల్లా మాధవి ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ...