ఆంధ్రప్రదేశ్ స్టేట్ పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ -2026 లో గుంటూరు జిల్లా పోలీస్ అత్యుత్తమ ప్రతిభ
గుంటూరు, 04 సెప్టెంబర్ 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : 1వ ఆంధ్రప్రదేశ్ స్టేట్ పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్–2026 రాష్ట్రస్థాయి పోలీస్ క్రీడా పోటీలలో గుంటూరు జిల్లా పోలీస్ శాఖకు చెందిన అధికారులు, సిబ్బంది అత్యుత్తమ ప్రతిభ కనబరిచి పలు పతకాలు సాధించారు. సెప్టెంబర్ 1వ తేదీ నుంచి 4వ తేదీ వరకు మంగళగిరిలోని ఏపీఎస్పీ 6వ బెటాలియన్ ప్రాంగణంలో నిర్వహించిన ఈ రాష్ట్రస్థాయి క్రీడా పోటీలలో రాష్ట్రంలోని వివిధ జిల్లాలు, పోలీస్ యూనిట్లకు చెందిన క్రీడాకారులు హోరాహోరీగా పోటీపడ్డారు. గుంటూరు...