చెరుకుపల్లి, 20 ఆగష్టు 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : స్వచ్ఛంద సంస్థలు ప్రజల ఆరోగ్య పరిరక్షణ కోసం అందించే ఉచిత వైద్య సేవలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ సోదరుడు అనగాని శివప్రసాద్ పిలుపునిచ్చారు. కావూరు గ్రామంలో డాక్టస్ బిజినెస్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, కాకతీయ కమ్యూనిటీ ఫౌండేషన్ మరియు తుమ్మల అమరేంద్ర జ్ఞాపకార్థం, హైదరాబాద్ బసవతారకం ఇండో-అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ & రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సౌజన్యంతో గురువారం నిర్వహించిన ఉచిత క్యాన్సర్ పరీక్షా శిబిరాన్ని ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ శిబిరంలో నిపుణులైన వైద్య బృందం ఆధ్వర్యంలో మమోగ్రఫీ, గర్భాశయ స్కానింగ్, పాప్ స్మియర్, ఊపిరితిత్తులకు సంబంధించిన కీలక పరీక్షలను ప్రజలకు ఉచితంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నాయకులు కొడాలి శ్రీనివాసరావు, సుఖవాసి వాసు, చెల్లి జ్యోతి రవికుమార్ మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.
ఉచిత క్యాన్సర్ పరీక్షా శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలి : అనగాని శివప్రసాద్


