ఉచిత క్యాన్సర్ పరీక్షా శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలి : అనగాని శివప్రసాద్
చెరుకుపల్లి, 20 ఆగష్టు 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : స్వచ్ఛంద సంస్థలు ప్రజల ఆరోగ్య పరిరక్షణ కోసం అందించే ఉచిత వైద్య సేవలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ సోదరుడు అనగాని శివప్రసాద్ పిలుపునిచ్చారు. కావూరు గ్రామంలో డాక్టస్ బిజినెస్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, కాకతీయ కమ్యూనిటీ ఫౌండేషన్ మరియు తుమ్మల అమరేంద్ర జ్ఞాపకార్థం, హైదరాబాద్ బసవతారకం ఇండో-అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ & రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సౌజన్యంతో గురువారం నిర్వహించిన ఉచిత క్యాన్సర్ పరీక్షా...