విద్యార్థుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలి
జీ. వో. నెం 77 రద్దు చేయాలి
ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటికరణ ఆపాలి
విద్యార్థులను మోసం చేసిన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలి
ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బందెల నాసర్ జీ
గుంటూరు, 20 ఆగష్టు 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : అఖిల భారత విద్యార్థి సమాఖ్య AISF గుంటూరు జిల్లా సమితి ఆధ్వర్యంలో మార్పు రావాలి, మార్పు కావాలి అనే నినాదంతో విద్యారంగా పరిరక్షణ జరగాలి అని గుంటూరు నగరంలోని పట్టాభిపురం మెయిన్ రోడ్ స్వామి థియేటర్ నుండి స్వామి వివేకానంధుని బొమ్మ వరకు పెద్ద ఎత్తున విద్యార్థులతో ర్యాలీ ప్రదర్శన చెప్పట్టారు. ఈ కార్యక్రమానికి. ముఖ్య అతిధిగా హాజరయిన AISF రాష్ట్ర కార్యదర్శి బందెల నాసర్ జీ, AIYF రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి షేక్ సుభాని మాట్లాడుతూ రాష్ట్రంలో విద్యారంగం అనేక సమస్యలను ఎదుర్కొంటున్నప్పటికీ ప్రభుత్వం వాటి పరిష్కారంపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించాలని, సంక్షేమ వసతి గృహాల్లో విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించాలని, పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌లను వెంటనే విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు. పేద విద్యార్థులకు ఉన్నత విద్యను దూరం చేసే విధానాలను ఉపసంహరించుకోవాలని, ప్రభుత్వ విద్యాసంస్థలను బలోపేతం చేయాలని కోరారు.

అలాగే ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను నిలిపివేయాలని, NTAను రద్దు చేయాలని, యూనివర్సిటీలకు తగినన్ని నిధులు కేటాయించి ఖాళీగా ఉన్న ప్రొఫెసర్ పోస్టులను భర్తీ చేయాలని వారు కోరారు. విద్యార్థుల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైతే రాష్ట్రవ్యాప్తంగా మరింత విస్తృతమైన ఉద్యమాన్ని చేపడతామని హెచ్చరించారు. పెండింగ్ లొ ఉన్న 6,400 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్లు విడుదల చేసి రాష్ట్రంలోని ప్రతి విద్యార్థికి న్యాయం చేస్తా హామీ ఇచ్చారు. తక్షణమే ఆ హామీని అమలు చేయాలనీ తెలిపారు. పి. జి విద్యార్థులకు శాపంగా మారిన జీ.వో నెం 77 ను రద్దు చేయాలనీ డిమాండ్ చేసారు.అంతేకాకుండా ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటికరణ ఆపక పోతే ఇక పై సాహించేది లేదు రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో AISF గుంటూరు జిల్లా కార్యదర్శి బందారపు యశ్వంత్ రఘువీర్, గుంటూరు నగర అధ్యక్ష, కార్యదర్శిలు గోలి సాయి పరిమళ ప్రణీత్ (బన్నీ) ప్రత్తిపాడు నియోజకవర్గ కార్యదర్శి అమర్నాథ్, మంగళగిరి నియోజకవర్గ కార్యదర్శి రెహమాన్, AISF నగర నాయకులు అజయ్, అబ్దుల్ తదితరులు పాల్గొన్నారు.


