Thursday, September 10, 2026
spot_imgspot_img

బ్రైట్ హారిజాన్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు

Must read

📰 Generate e-Paper Clip

గుంటూరు, 20 ఆగష్టు 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : బ్రైట్ హారిజాన్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు జరిగాయి. పట్టాభిపురం మౌలానా అబుల్ కలామ్ ఆజాద్ షాదీఖానా లో జాబ్ మేళా నిర్వహించారు. రాష్ట్ర మైనార్టీ ఎఫైర్స్ సలహాదారు అహ్మద్ షరీఫ్ ముఖ్య అతిథిగా హాజరై జాబ్ మేళాను ప్రారంభించారు. మొత్తం 53 కంపెనీలు హాజరై దాదాపు 2500 మంది నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ మౌలానా ముస్తాక్ అహ్మద్, షార్ప్ ఇండియా సీఈవో బాజీ, బ్రైట్ హారిజాన్స్ ఫౌండేషన్ అధ్యక్షుడు ఎం.కే.ఎస్ మొహిద్దిన్ తదితరులు పాల్గొన్నారు. నిరుద్యోగ యువత కోసం జాబ్ మేళా నిర్వహించడం ఆనందంగా ఉందని షరీఫ్ తెలిపారు. అదేవిధంగా 10, ఇంటర్, డిగ్రీ, ఇంజనీరింగ్, ఎంబీఏ తదితర కోర్సులు పూర్తి చేసిన వారికి అర్హత ప్రాతిపదికన ఉపాధి అవకాశాలు కల్పించడం జరిగిందని మొహిద్దిన్ చెప్పారు. పేద, మధ్యతరగతి కుటుంబాల కోసం నిరంతరం ఇలాంటి కార్యక్రమాలు కొనసాగిస్తామని ఆయన వెల్లడించారు.

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest article

App Icon

Install Bharath Prathinidhi News App

Add to home screen for faster loading and latest updates.