గుంటూరు, 21 ఆగస్ట్ 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : రెండు దశాబ్దాలుగా పెండింగ్ లో ఉన్న నల్లచెరువు వాకింగ్ ట్రాక్ నిర్మాణానికి ప్రత్యేక చర్యలు తీసుకున్నామని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే, అసెంబ్లీ మైనార్టీస్ కమిటీ చైర్మన్ నసీర్ అన్నారు. శుక్రవారం స్థానిక నల్లచెరువు వాకింగ్ ట్రాక్ నిర్మాణానికి రూ.50 లక్షలతో ఎమ్మెల్యే నసీర్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇక్కడ వాకింగ్ ట్రాక్ ఎత్తు పెంచడంతోపాటు మరుగుదొడ్లు, జిమ్, బ్యాడ్మింటన్ కోర్టు వంటి సౌకర్యాలు కల్పిస్తున్నామని తెలిపారు. రెండేళ్ల ఆకముందు నల్లచెరువు వాకింగ్ ట్రాక్ వద్ద ప్రజలు ఇబ్బందులు పడుతుండేవారిని చెప్పారు. దీంతోపాటు నియోజకవర్గంలోని అన్ని డివిజన్లో ఒక్కొక్క వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. అభివృద్ధి అంటే కూటమి ప్రభుత్వమని స్పష్టం చేశారు. నియోజకవర్గంలో అన్ని ప్రాంతాలలో పార్కులు స్విమ్మింగ్ పూల్ వంటి సౌకర్యాలు కల్పించబోతున్నామన్నారు.
వాటర్ ట్యాంక్ నిర్మాణానికి సహకరించండి : బిఆర్ స్టేడియం వద్ద శిథిలావస్థకు చేరిన వాటర్ ట్యాంకులు తొలగించి నూతనంగా నిర్మించబోతున్నామని, దీనికి ప్రజలు సహకరించాలని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే, అసెంబ్లీ మైనారిటీస్ కమిటీ చైర్మన్ నసీర్ అన్నారు. బీఆర్ స్టేడియం వద్ద వాటర్ ట్యాంకును ఎమ్మెల్యే నసీర్ పరిశీలించారు. నూతన ట్యాంక్ ఏర్పాటు క్రమంలో కొన్ని ప్రాంతాలకు మంచినీటి సమస్య తలెత్తుతుందన్నారు. సాధ్యమైనంత వరకు ప్రజలకు మంచి సేవలు అందించేందుకు ప్రయత్నిస్తామని చెప్పారు.


