నల్లచెరువు వాకింగ్ ట్రాక్ కు మహర్దశ

గుంటూరు, 21 ఆగస్ట్ 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : రెండు దశాబ్దాలుగా పెండింగ్ లో ఉన్న నల్లచెరువు వాకింగ్ ట్రాక్ నిర్మాణానికి ప్రత్యేక చర్యలు తీసుకున్నామని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే, అసెంబ్లీ మైనార్టీస్ కమిటీ చైర్మన్ నసీర్ అన్నారు. శుక్రవారం స్థానిక నల్లచెరువు వాకింగ్ ట్రాక్ నిర్మాణానికి రూ.50 లక్షలతో ఎమ్మెల్యే నసీర్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇక్కడ వాకింగ్ ట్రాక్ ఎత్తు పెంచడంతోపాటు మరుగుదొడ్లు, జిమ్, బ్యాడ్మింటన్ కోర్టు వంటి సౌకర్యాలు కల్పిస్తున్నామని తెలిపారు. రెండేళ్ల ఆకముందు నల్లచెరువు...