Thursday, September 10, 2026
spot_imgspot_img

ఏపీఎస్పీ ఇంజనీరింగ్ అసోసియేషన్ బిల్డింగ్ ఫౌండేషన్ వేసిన పి.పుల్లారెడ్డి

Must read

📰 Generate e-Paper Clip

గుంటూరు, 28 ఆగస్ట్ 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : శుక్రవారం గుంటూరులో ఏపీఎస్బీ ఇంజనీర్స్ అసోసియేషన్ బిల్డింగ్ ఫౌండేషన్ చైర్మెన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఏపీసీపీడీసీఎల్ విజయవాడ పి పుల్లారెడ్డి వేశారు. గురువారం రాత్రి జరిగిన 33 కేవీ బ్రేక్ డౌన్స్కు దాదాపుగా ఆరు గంటలు విద్యుత్ సరఫరా లేని పక్షంలో సంగడిగుంట, లాలాపేట, పొన్నూరు రోడ్డు, ఆనందపేట విద్యుత్ సరఫరా లేకపోవటం వలన పి. పుల్లారెడ్డి స్వయముగా జరిగిన ప్రదేశాన్ని వీక్షించారు. సంబంధిత అధికారులకు మరోకసారి ఇటువంటి సంఘటనలు జరగకుండా ప్రతిష్ఠాత్మకంగా ఆలోచనలు చేసి ప్రత్యేకంగా ప్రణాళిక తయారు చేయాలని కోరారు. జరిగిన విద్యుత్ అంతరాయానికి స్థానిక ఎమ్మెల్యే మహమ్మద్ నసీర్, క్షేత్రస్థాయిలో వీక్షించి అధికారులను చాలా అప్రమత్తంగా బాధ్యతగా ఉన్నట్లు సంతృప్తి వ్యక్తపరిచారు. ఈ కార్యక్రమం ఎస్ ఈ పర్యవేక్షణలో టౌన్ ఈ ఈ ఖాన్, టౌన్ వన్, టౌన్ త్రీ, టౌన్ ఫోర్, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు, స్థానిక ఏఈలు మరియు ఓ అండ్ ఎం స్టాఫ్, లైన్ ఇన్స్పెక్టర్లు, లైన్ మెన్లు అందరూ పాల్గొని రాత్రికి రాత్రే విద్యుత్ ప్రాతిపదికన బ్రేక్డౌన్స్ ని చేసినందుకు ప్రజలందరూ సంతోషించారు.

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest article

App Icon

Install Bharath Prathinidhi News App

Add to home screen for faster loading and latest updates.