వైద్యుడి నిర్లక్ష్యం కరణంగా ఓ నిండు ప్రాణం బలి
అనుమతులేని ఆసుపత్రిలో వైద్యం
45 రోజులు గడిచిన తర్వాత బాధితులపైనే ఫిర్యాదు చేసిన వైద్యుడు
ఇబ్రహీంపట్నం ఓ వైద్యశాల నిండు ప్రాణం తీసివేసిందంటూ బాధితులు ఆరోపిస్తున్నారు. కొండపల్లి కి చెందిన ఓ వ్యక్తి గ్యాస్ నొప్పితో ఆస్పత్రికి తన వాహనంపై చేరుకోగా డాక్టర్ లేని సమయంలో ఓ కాంపౌండర్ డాక్టర్లకు ఫోన్ చేసి సలహాల మేరకు వైద్యం అందించాడు. గ్యాస్ నొప్పితో వచ్చిన వ్యక్తికి గుండె కు సంబంధించిన ఇంజక్షన్ చేయటం వలన ప్రాణం పోయిందంటూ బాధితులు వాపోతున్నారు. చనిపోయిన తరువాత ఆ వ్యక్తికి సిపిఆర్ చేశారంటూ … చనిపోయే ముందు ఈసీజీ తీశామంటూ. ఈసీజీలో గుండెకు సంబంధించి ప్రాబ్లం ఉండటంతో ఇంజక్షన్ చేశామంటూ ఒకసారి… చేయలేదంటూ మరొకసారి డాక్టర్లు బొంగుతున్నారని వాపోయారు.. ఇంటిదగ్గర గ్యాస్ నొప్పితో బయలుదేరిన వ్యక్తి ఆసుపత్రికి వచ్చిన తర్వాత కూడా వైద్యం అందించాక ఆసుపత్రిలోనే బాత్రూం కి వెళ్లి వచ్చి ఒక్కసారిగా కుప్పకూలిపోయారంటూ బాధితులు తెలిపారు. అయితే కుప్పకూలిన వ్యక్తికి వైద్యం అందించి కొద్ది నిమిషాలలోనే చనిపోయారు తీసుకు వెళ్ళమంటూ చెప్పటంతో కుటుంబ సభ్యులు మృతదేహాన్ని అక్కడ నుండి ఇంటికి తీసుకువెళ్లారు. నాలుగు రోజులు గడిచిన తర్వాత చనిపోయిన వ్యక్తి భార్య జ్వరంతో బాధపడుతూ ఉండగా అదే ఆసుపత్రికి చేరుకొని వైద్యం చేయించుకున్నాక, చివరిసారి మా వారు తిరిగిన ప్రదేశం ఇదే కాబట్టి ఒకసారి వీడియో చూపిస్తే చూసుకుంటాను అని డాక్టర్లను కాళ్లపై పడి అడగగా దానికి డాక్టర్లు కంప్యూటర్ గురించి నాకు తెలియదు. రేపు సీసీ కెమెరా టెక్నీషియన్ ను పిలిపిస్తానని నీకు ఆ సిసి ఫుటేజ్ వీడియో అందిస్తానని తెలిపి పంపించేశారు. మరోసారి ఆసుపత్రికి వెళ్లి అడగక ఇదిగో రేపు అంటూ మరోసారి వెళితే మరోసారి అంటూ వారిని తిప్పించారు. దీంతో వారికి అనుమానం వచ్చి నా భర్తకు సంబంధించిన డెత్ సర్టిఫికేట్ కావాలని కోరగా డెత్ సర్టిఫికెట్ కోసం ఇదిగో ఈరోజు రేపు అంటూ కాలం గడిపారు. తీరా మరోసారి వెళ్లి అడగక పంచాయతీ ఆఫీసులో ఉంది తీసుకోమని చెప్పగా బాధితులు మరణ ధ్రువీకరణ పత్రం కోసం పంచాయతీ ఆఫీస్ కు చేరుకోగా ఆసుపత్రి పేరు ఇక్కడ లేదని, మీరు డాక్టర్లే సంప్రదించాలని బాధితులకు తెలపగా మరల చేసేది లేక ఆసుపత్రికి చేరుకొని డాక్టర్ ను కోరారు. అప్పుడే అసలు విషయం బయటకు వచ్చింది ఆసుపత్రికి ఎటువంటి అనుమతులు లేకుండా ఆసుపత్రిని నడుపుతున్నారని, ఆస్పత్రి అనుమతి కోసం అప్పుడే డబ్బులు చెల్లించి అనుమతి పొందుతున్నారని, అందువల్లనే మరణ దివీకరణ పత్రం రావటం ఆలస్యం అవుతుందని తెలిసిందన్నారు. అసలు అనుమతి లేకుండా నా భర్తకు ఏ వైద్యం చేశారు. ఎందుకు చంపారు అంటూ బాధితులు డాక్టర్లను నిలదీశారు. చనిపోయిన నాలుగు రోజుల నుండి ఆసుపత్రి చుట్టూ తిరుగుతూ సర్టిఫికెట్ అడుగుతున్న ఇవ్వకపోవడంతో పలు అనుమానాలు దారి తీసాయి. సర్టిఫికెట్ లో కూడా డాక్టర్ ఆలోచన లేకుండా సర్టిఫికెట్ ఇచ్చిన విధానం చూస్తే అర్థమవుతుందని అంటున్నారు. 10:45 ఆస్పత్రికి వచ్చారు.10:46 అడ్రినాలిన్ ఇంజెక్షన్ ఇంజక్షన్ చేశాను తీసుకువెళ్లిపొమ్మని చెప్పారు.10:55 నుండి స్పృహ లేకుండా ఉన్నారని, 11:23 చనిపోయారని సర్టిఫికెట్లో రాయడంతో మాకు పలు అనుమానాలు కలుగుతున్నాయని, సిసి ఫుటేజ్ ను పలుమార్లు కావాలని కోరినప్పటికీ 45 రోజులు గడిచిన తర్వాత మా మీదే పోలీస్ ఫిర్యాదు చేశారంటూ బాధితులు వాపోయారు. ఇన్ని రోజులు నమ్మకంగా నమ్మించి సిసి ఫుటేజ్ ఇస్తానని మాయమాటలు చెప్పి ఆసుపత్రికి వచ్చాక ఆస్పత్రి సిబ్బంది మరియు మరి కొంతమంది మమ్ములను రౌండ్ అప్ చేశారు. దీంతో మేము ఇబ్రహీంపట్నం పోలీసులను ఆశ్రయించాము. మా కన్నా ముందుగానే వారి మనుషుల్లో ఒకరు పోలీస్ స్టేషన్ కి చేరుకొని మా మీద ఫిర్యాదు చేయడంపై నా భర్త చావుకి కారణం వైద్యుడు నిర్లక్ష్య కారణమని అర్థమవుతుందని దీని వెనుక ఎవరెవరు ఉన్నారు. నా భర్తకు ఎటువంటి వైద్యం అందించారు. అనేది సి సి ఫుటేజ్ బయటకు తీస్తే అర్థమవుతుందని, తమకు న్యాయం జరిగే వరకు పోరాడతానని, ఇలాంటి అనుమతులు లేకుండా ఆసుపత్రి నడుపుతున్న వారిపై ప్రభుత్వం చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, నాకు జరిగినట్లుగా ఏ ఒక్కరికి అన్యాయం జరగకూడదని, బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. దీనిపై సంబంధిత ఇబ్రహీంపట్నం సీఐ సుబ్రహ్మణ్యం స్పందించి బాధితులకు న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. సీఐ బాధితులతో మాట్లాడిన విధానంపై న్యాయం చేకూరుతుందని నమ్మకంతో ఎదురుచూస్తున్నామని బాధితులు తెలిపారు.


