Friday, September 11, 2026
spot_imgspot_img

డీఎస్సీ అక్రమాలపై వైఎస్సార్‌సీపీ సమరభేరి

Must read

📰 Generate e-Paper Clip

కాకినాడలో మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ

కాకినాడ బ్యూరో, 10 ఆగష్టు 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : డీఎస్సీ నియామకాల్లో జరిగిన అక్రమాలను నిరసిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం కాకినాడ నగరంలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు, కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి నాయకత్వంలో ఈ కార్యక్రమం జరిగింది. ఆనందభారతి గ్రౌండ్ నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీ, వైఎస్సార్ బ్రిడ్జి డౌన్‌లోని దివంగత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహం వరకు కొనసాగింది. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి మాట్లాడుతూ గత కొన్ని రోజులుగా డీఎస్సీ అక్రమాలపై వైఎస్సార్‌సీపీ నిరంతర నిరసన దీక్షలు చేపడుతోంది. విద్యార్థుల భవిష్యత్తును తొక్కేస్తూ తెలుగుదేశం ప్రభుత్వం ప్రజావ్యతిరేక పాలన సాగిస్తోంది. నిరుద్యోగుల ప్రయోజనాలను కాపాడేందుకే ఈరోజు కాకినాడలో భారీ ర్యాలీ నిర్వహించాం” అని స్పష్టం చేశారు. పదహారేళ్ళ ఉద్యోగాలు ఇచ్చామని ప్రభుత్వం సంబరాలు చేసుకోవడం హాస్యాస్పదంగా ఉందన్నారు గతంలో వైయస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో సచివాలయ వ్యవస్థ ద్వారా దాదాపు నాలుగు లక్షల ఉద్యోగాలను రూపాయి అవినీతి మచ్చ లేకుండా పారదర్శకంగా భర్తీ చేశారని గుర్తు చేశారు కానీ నేడు కేవలం 16 వేల ఉద్యోగాలు నియమకంలోనే తీవ్ర వివాదాలు అక్రమాలు వెలుగులోకి వచ్చాయని మండిపడ్డారు డీఎస్సీ నియమకల్లో జరిగిన అక్రమాలపై తక్షణం సిబిఐ చేత సమగ్ర విచారణ జరిపించాలి విచారణ పూర్తయ్యే వరకు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తన పదవికి తక్షణమే రాజీనామా చేయాలని నైతిక బాధ్యత వహించి సిబిఐ విచారణకు సిద్ధపడితేనే ప్రభుత్వం తమ నిజాయితీని నిరూపించుకున్నట్లు అవుతుందని స్పష్టం చేశారు మరోవైపు రాష్ట్రంలో ఫీజు రియంబర్స్మెంట్ నిధులు విడుదల చేయకపోవడం వల్ల విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు డీఎస్సీలో ఎంపికైన అభ్యర్థులకు కూడా కళాశాల యాజమాన్యాలు సర్టిఫికెట్లు ఇవ్వడం లేదని ఫీజు బకాయి చెల్లిస్తేనే సర్టిఫికెట్లు ఇస్తామని చెబుతున్నారని తెలిపారు దీనివల్ల విద్యార్థి భవిష్యత్ ప్రశ్నార్ధకంగా మారుతుందన్నారు. వైఎస్సార్‌సీపీ యువజన విభాగం అధ్యక్షుడు రాగిరెడ్డి అరుణ్ కుమార్ మాట్లాడుతూ టీడీపీ హయాంలో విద్యార్థులకు, నిరుద్యోగులకు సరైన నియామకాలు జరగలేదని విమర్శించారు. కేవలం కొన్ని తాత్కాలిక పత్రాలు చూపించి విద్యార్థులను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. డీఎస్సీ అక్రమాలపై తక్షణమే సమగ్ర విచారణ జరిపించాలని, ఈ విఫల విధానాలకు బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అలాగే ఎన్నికల సమయంలో నిరుద్యోగి యువతకు ఇచ్చిన 3 నిరుద్యోగ భృతి హామీని ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని రెండేళ్లు గడుస్తున్నా దానిపై స్పందించకపోవడం దారుణమని విమర్శించారు. ప్రభుత్వం ఇప్పటికైనా కళ్లు తెరిచి విద్యార్థులు నిరుద్యోగుల సమస్యలను పరిష్కరించాలని లేనిపక్షంలో పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ నిరసన కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, వైఎస్సార్‌సీపీ అనుబంధ విభాగాల నాయకులు, శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.విభాగం అధ్యక్షుడు రాగిరెడ్డి అరుణ్ కుమార్ మాట్లాడుతూ టీడీపీ హయాంలో విద్యార్థులకు, నిరుద్యోగులకు సరైన నియామకాలు జరగలేదని విమర్శించారు. కేవలం కొన్ని తాత్కాలిక పత్రాలు చూపించి విద్యార్థులను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. డీఎస్సీ అక్రమాలపై తక్షణమే సమగ్ర విచారణ జరిపించాలని, ఈ విఫల విధానాలకు బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో మాజీ కూడా చైర్మన్ రాగిరెడ్డి చంద్రకళ దీప్తి (కుమార్) వైసిపి పార్టీ సిటీ అధ్యక్షురాలు సుంకర శివ ప్రసన్న విద్యాసాగర్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ పసుపులేటి వెంకటలక్ష్మి, మాజీ డిప్యూటీ మేయర్ ఉదయ్, కిషోర్, కంపర బాబి, బల్ల సూరిబాబు, దీపక్, కరుణ, దుర్గాప్రసాద్, అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest article

App Icon

Install Bharath Prathinidhi News App

Add to home screen for faster loading and latest updates.