డీఎస్సీ అక్రమాలపై వైఎస్సార్‌సీపీ సమరభేరి
కాకినాడలో మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ కాకినాడ బ్యూరో, 10 ఆగష్టు 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : డీఎస్సీ నియామకాల్లో జరిగిన అక్రమాలను నిరసిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం కాకినాడ నగరంలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు, కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి నాయకత్వంలో ఈ కార్యక్రమం జరిగింది. ఆనందభారతి గ్రౌండ్ నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీ, వైఎస్సార్ బ్రిడ్జి డౌన్‌లోని దివంగత డాక్టర్ వైఎస్...