Friday, September 11, 2026
spot_imgspot_img

అనంతపురం జిల్లాలో రోడ్డు ప్రమాదం.. 20 మందికి తీవ్రగాయాలు

Must read

📰 Generate e-Paper Clip

అనంతపురం, 09 ఆగస్టు 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : అనంతపురం జిల్లా పామిడి మండలం పొగరూరు గ్రామ సమీపంలోని హైదరాబాద్ – బెంగళూరు జాతీయ రహదారిపై ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు- ఐషర్ వాహనం ఢీకొన్నాయి. దీంతో కల్వర్టుపై నుంచి ఆ రెండు వాహనాలు కింద పడ్డాయి. ఈ ప్రమాదంలో 18 మంది ప్రయాణికులతోపాటు డ్రైవర్లకు తీవ్ర గాయాలయ్యాయి. అదే రహదారిపై వెళ్తున్న వాహనదారులు వెంటనే స్పందించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వెంటనే ఘటన స్థలానికి చేరుకుని.. క్షతగాత్రులను పామిడిలోని ఆసుపత్రికి తరలించారు. అంతకుముందు బస్సు- ఐషర్ వాహనాల్లో ఇరుక్కుపోయిన డ్రైవర్లను స్థానికుల సహాయంతో పోలీసులు రక్షించారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అతి వేగంతోపాటు నిద్ర మత్తు కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు అంచనా వేస్తున్నారు.

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest article

App Icon

Install Bharath Prathinidhi News App

Add to home screen for faster loading and latest updates.