అనంతపురం జిల్లాలో రోడ్డు ప్రమాదం.. 20 మందికి తీవ్రగాయాలు
అనంతపురం, 09 ఆగస్టు 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : అనంతపురం జిల్లా పామిడి మండలం పొగరూరు గ్రామ సమీపంలోని హైదరాబాద్ - బెంగళూరు జాతీయ రహదారిపై ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు- ఐషర్ వాహనం ఢీకొన్నాయి. దీంతో కల్వర్టుపై నుంచి ఆ రెండు వాహనాలు కింద పడ్డాయి. ఈ ప్రమాదంలో 18 మంది ప్రయాణికులతోపాటు డ్రైవర్లకు తీవ్ర గాయాలయ్యాయి. అదే రహదారిపై వెళ్తున్న వాహనదారులు వెంటనే స్పందించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వెంటనే ఘటన స్థలానికి చేరుకుని.. క్షతగాత్రులను పామిడిలోని ఆసుపత్రికి తరలించారు. అంతకుముందు...