కాణిపాకం, 08 ఆగస్టు 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : స్వయంభు కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి ఆలయం శనివారం భక్తుల రద్దీతో కిటకిటలాడింది. ఉదయం నుంచి అధిక సంఖ్యలో భక్తులు స్వామి దర్శనానికి విచ్చేశారు. దీంతో ఆలయ క్యూలైన్లు పూర్తిగా నిండిపోయాయి. వెలుపల వరకు వ్యాపించాయి. ప్రతి భక్తుడికి స్వామివారి దర్శనం కల్పించడానికి చైర్మన్ మణినాయుడు,ఈవో పెంచలకిషోర్ క్యూల్లను క్రమబద్ధీకరించారు. క్యూలైన్లలో స్వామివారి దర్శనార్థం వేచి ఉన్న భక్తులకు ఆలయ సిబ్బంది తాగునీరు అందించారు.


