Friday, September 11, 2026
spot_imgspot_img

మీడియాకు ఇక స్మార్ట్ అక్రిడిటేషన్

Must read

📰 Generate e-Paper Clip

QR కోడ్ డిజిటల్ పాస్‌తో క్షణాల్లో జర్నలిస్టుల గుర్తింపు

నకిలీ మీడియా పాస్‌లకు చెక్‌..

నెల్లూరు, భారత్ ప్రతినిధి : మీడియా ప్రతినిధుల గుర్తింపు ప్రక్రియను మరింత పారదర్శకంగా, వేగవంతంగా, సురక్షితంగా మార్చేందుకు నెల్లూరు ఎస్పీ డా. అజిత వెజెండ్ల, IPS QR కోడ్ ఆధారిత స్మార్ట్ మీడియా అక్రిడిటేషన్ వ్యవస్థను ప్రారంభించారు. ప్రత్యేక QR కోడ్ డిజిటల్ పాస్ ద్వారా జర్నలిస్టుల వివరాలను క్షణాల్లో ధృవీకరించే సదుపాయం కల్పించారు. దీంతో నకిలీ మీడియా పాస్‌లకు అడ్డుకట్ట పడనుంది. మీడియా మిత్రుల అభ్యర్థన మేరకు సోమవారం కూడా నెల్లూరులోని ఉమేష్ చంద్ర కాన్ఫరెన్స్ హాల్‌లో QR కోడ్ రిజిస్ట్రేషన్ కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఎస్పీ చెప్పారు. ఇదే తరహా స్మార్ట్‌ మీడియా అక్రిడిటేషన్‌ విధానాన్ని త్వరలోనే తిరుపతిలోనూ ప్రారంభించనున్నట్లు సమాచారం.

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest article

App Icon

Install Bharath Prathinidhi News App

Add to home screen for faster loading and latest updates.