గుంటూరు, 03 ఆగస్టు 2026, భారత్ ప్రతినిధి : స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయ ప్రాంగణం అన్నమయ్య కళావేదికపై నటనాలయ అధ్యక్షుడు నీలం మందారావు ఆధ్వర్యంలో సోమవారం జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య జయంతి కార్యక్రమం ఘనంగా జరిగింది. తొలుత పింగళి వెంకయ్య చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా జరిగిన సభకు డాక్టర్ పట్టాభి కళా పీఠం వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ తూములూరి రాజేంద్రప్రసాద్ అధ్యక్షత వహించారు. ఆధితులుగా మాజీ ఎమ్మెల్సీ కె ఎస్ లక్ష్మణరావు, ఆలయ కమిటీ అధ్యక్షులు సిహెచ్ మస్తానయ్య, రాష్ట్ర రెడ్ క్రాస్ సొసైటీ ఉపాధ్యక్షులు పి. రామచంద్ర రాజు, విజ్డమ్ వాటర్ వర్క్స్ అధినేత కాళoగి వంశీకృష్ణ, గుంటూరు అన్నదాన సమాజం ఈవో జి. శ్రీనివాసరావు, రంగస్థలం నటుడు కొల్లూరి శివప్రసాద్ తదితరులు పాల్గొని ప్రసంగించారు.సభానంతరం శ్రీమతి జ్యోతి సరళ స్మారక కళాపరిషత్ విశాఖపట్నం వారు ఆకెళ్ళ రచనకు, కొండవలస లక్ష్మణరావు దర్శకత్వం వహించిన, పి సి హెచ్ నాయుడు నిర్వహణలో ప్రదర్శించిన రేపటి శత్రువు నాటిక ప్రేక్షకులను ఆకట్టుకుంది.


