గుంటూరులో ఘనంగా పింగళి వెంకయ్య జయంతి కార్యక్రమం

గుంటూరు, 03 ఆగస్టు 2026, భారత్ ప్రతినిధి : స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయ ప్రాంగణం అన్నమయ్య కళావేదికపై నటనాలయ అధ్యక్షుడు నీలం మందారావు ఆధ్వర్యంలో సోమవారం జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య జయంతి కార్యక్రమం ఘనంగా జరిగింది. తొలుత పింగళి వెంకయ్య చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా జరిగిన సభకు డాక్టర్ పట్టాభి కళా పీఠం వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ తూములూరి రాజేంద్రప్రసాద్ అధ్యక్షత వహించారు. ఆధితులుగా మాజీ ఎమ్మెల్సీ కె ఎస్ లక్ష్మణరావు, ఆలయ కమిటీ అధ్యక్షులు...