Thursday, September 10, 2026
spot_imgspot_img

ఆత్మహత్యల నివారణ పై అవగాహన కార్యక్రమం

Must read

📰 Generate e-Paper Clip

వారోత్సవాల్లో పాల్గొన్న డిఎంహెచ్వో

గుంటూరు, 08 సెప్టెంబర్ 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : ఆత్మహత్యల నివారణ వారోత్సవంలో భాగంగా, ఎయిమ్స్ మంగళగిరి, మానసిక వైద్య విభాగం ఆధ్వర్యంలో ఇందిరా నగర్ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (యూపీ.హెచ్.సి) లో అవగాహన కార్యక్రమం మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆత్మహత్యల నివారణ, ఆత్మహత్యకు సంబంధించిన హెచ్చరిక సంకేతాలు, లక్షణాలు, భారతదేశానికి సంబంధించిన గణాంకాలు, టెలి – మనస్ హెల్ప్‌లైన్ నంబర్ (14416) నివారించాల్సిన అంశాలు మరియు ఆత్మహత్య ప్రమాదంలో ఉన్న వ్యక్తులకు ఎలా సహాయం మరియు మద్దతు అందించాలనే విషయాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రమాద సంకేతాలను ముందుగానే గుర్తించడం, సకాలంలో జోక్యం చేసుకోవడం మరియు అవసరమైనప్పుడు వృత్తిపరమైన సహాయం పొందడం వంటి అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారిణి డా.కే.విజయలక్ష్మి, సృజన, ఎస్.పి.యం,స్టేట్ ఎన్హెచ్ఎం, డా. రాజీవ్, సిఎఫ్ డబ్ల్యూ, ఎయిమ్స్ మంగళగిరి, డా. సుజాత, సీపీఎంఓ, డా. శ్రీధర్, పి ఓ, ఎన్సిడి డా.అనూష, డా.సుభాషిణి వైద్యాధికారులు, వేణు ఎన్హెచ్ఎం కన్సల్టెంట్ పాల్గొన్నారు.

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest article

App Icon

Install Bharath Prathinidhi News App

Add to home screen for faster loading and latest updates.