ఆత్మహత్యల నివారణ పై అవగాహన కార్యక్రమం
వారోత్సవాల్లో పాల్గొన్న డిఎంహెచ్వో గుంటూరు, 08 సెప్టెంబర్ 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : ఆత్మహత్యల నివారణ వారోత్సవంలో భాగంగా, ఎయిమ్స్ మంగళగిరి, మానసిక వైద్య విభాగం ఆధ్వర్యంలో ఇందిరా నగర్ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (యూపీ.హెచ్.సి) లో అవగాహన కార్యక్రమం మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆత్మహత్యల నివారణ, ఆత్మహత్యకు సంబంధించిన హెచ్చరిక సంకేతాలు, లక్షణాలు, భారతదేశానికి సంబంధించిన గణాంకాలు, టెలి - మనస్ హెల్ప్‌లైన్ నంబర్ (14416) నివారించాల్సిన అంశాలు మరియు ఆత్మహత్య ప్రమాదంలో ఉన్న వ్యక్తులకు ఎలా సహాయం...