Thursday, September 10, 2026
spot_imgspot_img

ఉపాధ్యాయులు రాధాకృష్ణన్ ని ఆదర్శంగా తీసుకోవాలి : డిఇఓ

Must read

📰 Generate e-Paper Clip

గుంటూరు, 05 సెప్టెంబర్ 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : ఉపాధ్యాయులు సర్వేపల్లి రాధాకృష్ణన్ ఆదర్శంగా తీసుకోవాలని గుంటూరు జిల్లా విద్యాశాఖ అధికారి డాక్టర్ షేక్ సలీం భాష అన్నారు. గుంటూరు పాత బస్టాండ్ కూడలిలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో గల సర్వేపల్లి రాధాకృష్ణన్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సర్వేపల్లి రాధాకృష్ణన్ వలన ఏ వృత్తిలో ఉన్న వారికి లేని గౌరవం ఉపాధ్యాయ వృత్తి కి ఉన్నదన్నారు. అందువలన ఉపాధ్యాయులు ఉన్నత ఆశయంతో వారి ఆశయాలకు అనుగుణంగా నడుచుకోవాలన్నారు. ఉపాధ్యాయ వృత్తికే వన్నె తెచ్చే విధంగా కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో డిసిఈ బి సెక్రటరీ కె. విజయభాస్కర్, ఉర్దూ పాఠశాలల ఉప తనిఖీ అధికారి ఎండీ ఖాసీం, మంగళగిరి మండల విద్యాశాఖ అధికారి బాబు తదితరులు పాల్గొన్నారు.

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest article

App Icon

Install Bharath Prathinidhi News App

Add to home screen for faster loading and latest updates.